ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మహమ్మారి వైరస్ వెలుగు లోకి వచ్చి  నెల సమయం గడుస్తున్నప్పటి కీ ఇప్పటివరకు ఈ మహమ్మారి కి సరైన బాక్సింగ్ కూడా అందుబాటు లోకి రాకపోవడం తో దేశ ప్రజానీకం మొత్తం భయం గుప్పిట్లో బతికిన విషయం తెలుస్తుంది. కానీ ఇటీవల భారత్ బయోటెక్ నుంచి కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుగొన్నామ ని ఒక శుభవార్త చెప్పడం తో దేశ ప్రజానీకం మొత్తం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. భారత్ బయోటెక్.. ఐ సి ఎం ఆర్ తో కలిసి సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన విషయం తెలిసిందే. 

 


 అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతు లు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్స్ దశ లో ఉంది. అయితే ఎలాంటి ఆధారం లేని సమయం లో ప్రస్తుతం అందరి కీ దిక్కు  గా మారిన భారత్ బయోటెక్ వ్యాక్సిన్  గురించి ప్రస్తుతం ఎన్నో విమర్శ లు కూడా వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యాక్సిన్ కు సంబంధించి సరికొత్త వాదన ను తెర మీది కి రాగా  ప్రస్తుతం ఇది స్థలంగా మారిపోయింది. 

 


 ప్రస్తుతం ఈ మహమ్మారి వైరస్కు వ్యాక్సిన్ కనుగొన్నది కమ్మ కులం వాడేనని.. ఈ నేపథ్యంలో కమ్మ కులాన్నీ వ్యతిరేకించే వాళ్ళు అందరూ ఈ వైరస్ వ్యాక్సిన్ వాడకుండా ఉంటారా.. కమ్మ కులాని కి చెందిన ఆడపిల్లలను అగౌరపరచడం.. అంటూ ఓ సరి కొత్త వాదన ప్రస్తుతం తెరపైకి వచ్చింది. అయితే కరోనా  మందు వస్తుందని ఆనంద పడాల్సింది పోయి ఈ మందుకు కులం మతం అంటగట్టడం ఏమిటి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: