భారత్-చైనా సరిహద్దు లో నెలకొన్న ఘర్షణల దృశ్య భారతదేశంలో చైనా కు సంబంధించిన 59 యాప్స్ నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే చైనా కు సంబంధించిన 59 యాప్స్  నిలిపివేసినప్పటికి... ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్నది యాప్స్  పేరు మాత్రం హలో టిక్ టాక్ మాత్రమే. ప్రస్తుతం ముఖ్యంగా టిక్టాక్ పేరు ఎక్కువగా సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించింది టిక్టాక్. ఏకంగా 30 కోట్ల వినియోగదారులను  సంపాదించుకుంది. ప్రస్తుతం అందరికీ వ్యసనంగా మారి పోగా ప్రస్తుతం ఈ యాప్ నిషేధానికి గురైనందుకు ఎంతో మంది మనస్తాపం చెందారు అని కూడా చెప్పవచ్చు. 

 


 కొంతమంది మనస్తాపానికి గురై బోరున విలపించిన ఘటనలు కూడా మనం చూసాం. కేవలం భారత్  మాత్రమే టిక్ టాక్ లో అతి పెద్ద ఆదాయ వనరు కావడంతో ఎలాగైనా భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి.. మళ్లీ భారత్లో టిక్ టాక్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ఆ సంస్థ యాజమాన్యం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఒక సరికొత్త ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది టిక్టాక్ యాజమాన్యం. టిక్టాక్ సర్వర్లు అంత ఉండేది చైనాలో కాదని సింగపూర్ లో అని.. దీనికి సంబంధించిన డేటా మొత్తం సింగపూర్ లోనే ఉంటుందని..  అధికారులను పంపించి నిర్ధారణ చేసుకొని.. ఆ తర్వాతనే అనుమతులు ఇవ్వండి. 

 


 మేము వినియోగదారుల డేటాను చైనాకు ఇవ్వబోము.. మమ్మల్ని అర్థం చేసుకుని  టిక్ టాక్ లో భారత్ లో అందుబాటులోకి తీసుకురావాలని కోరింది. అయితే ఈ సరికొత్త ఎత్తుగడ కి భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారింది. టిక్ టాక్ ని భారత్లో అందుబాటులోకి తెస్తోంద.. లేదా టిక్ టాక్ కి మరో సారి షాక్ ఇస్తుందా  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: