గత మూడు రోజుల నుండి కేరళ లో 200కు పైగా కరోనా కేసులు నమోదు కాగా ఈరోజు మాత్రం ఆసంఖ్య స్వల్పంగా తగ్గింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 193 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది అలాగే ఈరోజు కరోనా నుండి 167మంది బాదితులు కోలుకోగా  ఇద్దరు మరణించారు.
 
ఈకొత్త కేసులతో కలిపి కేరళలో ఇప్పటివరకు మొత్తం 5622కేసులు నమోదుకాగా అందులో 3341మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 2252 కేసులు యాక్టీవ్ గా ఉండగా ఇప్పటివరకు మొత్తం 27మంది కరోనాతో మరణించారు. ఇక కరోనా కేసులు పెరగడంతో  కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈరోజు నుండి కఠినమైన లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. వారం రోజులపాటు ఈలాక్ డౌన్ కొనసాగనుంది. 
 
ఇక ఇదిఇలావుంటే మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఈరోజు భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి అందులో భాగంగా తమిళనాడులో 3827 కేసులు కర్ణాటకలో 1843కేసులు నమోదుకాగా తెలంగాణలో 1831 ,ఆంధ్రప్రదేశ్ లో 1322కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే దేశంలో కరోనా కేసుల సంఖ్య 715000 దాటగా 20000మరణాలు చోటుచేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: