కరోనా వైరస్ కారణంగా జరగాల్సిన పబ్లిక్ పరీక్షలు మిగతా తరగతులు పరీక్షలు లేకుండానే పై స్థాయి తరగతులకు విద్యార్థులు ప్రమోట్ అయిపోయారు. మార్చి నెల సరిగ్గా పరీక్షలు జరిగే టయానికి కరోనా వైరస్ రావటంతో దేశమంతటా లాక్డౌన్ కావటంతో మొత్తం స్కూల్ లు కాలేజీలు  మూతపడటం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కావాల్సిన ఈ టైంలో కూడా కరోనా వ్యాప్తి  భయంకరంగా ఉండటంతో ఏం చేయలేని పరిస్థితి అంతటా నెలకొంది. రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో చాలా వరకు జనం అడుగు తీసి అడుగు బయటకు వేయలేకపోతున్నారు.

 

చాలా ప్రాంతాలలో పాజిటివ్ కేసులు బయటపడటంతో అంతటా రెడ్ జోన్స్ పెట్టడం జరిగింది. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లకు టీచర్లు హాజరు కావాల్సి ఉంటుంది అంటూ ప్రభుత్వం సరికొత్త ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పర్ ప్రైమరీ, హైస్కూల్‌ ఉపాధ్యాయులు ప్రతి సోమ, మంగళవారాల్లో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి ప్రాథమిక పాఠశాల టీచర్లు వారంలో ఒక రోజు ప్రతి మంగళవారం హాజరు కావాలని పేర్కొంది. బ్రిడ్జి కోర్సులను రూపొందించేందుకు హాజరుకావాలని ప్రభుత్వం తెలిపింది.. నాడు-నేడు పనులు అన్ని స్కూళ్లల్లో ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

దీంతో ప్రస్తుతం కరోనా వైరస్ ఎఫెక్ట్ బయటే గట్టిగా ఉండటంతో చాలా మంది టీచర్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భయపడిపోతున్నారట. బయట పాజిటివ్ కేసులు భయంకరంగా ఉన్న ఈ టైం లో విధులకు హాజరు అవ్వాలంటే కష్టమే అంటూ చాలామంది అంటున్నారు. కొద్దిగా వైరస్ ప్రభావం తగ్గాక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మరికొంతమంది సూచిస్తున్నారు. ఏదిఏమైనా పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో ఏపీలో నమోదవుతున్న టైంలో స్కూళ్లకు టీచర్లు హాజరుకావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: