తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. రోజు రోజుకీ విజృంభిస్తున్న ఈ వైరస్ తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుండి వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదు కావడం ప్రభుత్వాన్ని ఆందోళనకర పరిస్థితుల్లోకి నెట్టుకేళ్తుంది. ఆదివారం నాడు పదిహేను వందల కేసులు నమోదు కాగా ఏడుగురు మరణించడం జరిగింది. ఇక తాజాగా ఈ రోజు గడచిన 24 గంటల్లో 1831 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 25,733కి చేరింది.  ఇందులో  10466 కేసులు  యాక్టివ్ గా ఉంటె, 14,781 మంది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.  పదకొండు మంది మరణించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరణాల సంఖ్య 306 కు చేరింది. నమోదైన కేసులో చాలావరకు జిహెచ్ఎంసి పరిధిలో ఉండటం విశేషం.

 

ఇదిలా ఉండగా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్ల చేత శభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ తో పోరాడుతున్న రోగులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులలో సరైన వైద్య సదుపాయం కల్పించడం లేదని చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు సోషల్ మీడియాలో వీడియో తీసి పోస్ట్ చేస్తున్నారు.

 

కాగా ఈ విధంగానే హైదరాబాద్ నగరానికి చెందిన  మహ్మద్‌ రఫీ అనే వ్యక్తి రెండు రోజుల అనార్యోగానికి గురయ్యాడు. శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో శనివారం ఆస్పత్రికి వెళ్లాగా, చేర్చుకోవడానికి వారు నిరాకరించారు. దాంతో వెంటనే ఇంటర్నెట్ లో మంత్రి ఈటెల రాజేందర్ ఫోన్ నెంబర్ చూసి వెంటనే ఫోన్ చేయగా…. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి తెలుసుకుని ఈటెల రాజేందర్ వెంటనే వచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో నెటిజన్లు అంతా ఈటెల రాజేందర్ పనితీరుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: