ప్రస్తుత కాలంలో యువత ఎంత ట్రెండ్ ఫాలో అవుతన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రకాల హెయిర్ కట్స్ తో అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇంకా వారికీ ఇష్టమైన హీరో మంచి హెయిర్ స్టైల్ లో కనిపించడు అంటే మరో వారంలో ఆ హెయిర్ స్టైల్ లో కనిపిస్తారు. ఈ కాలంలో ఇది సర్వసాధారణం. 

 

మానుషాలకంటే సాధారణం.. మరి జంతువులకు ? అవి మనుషుల్లానే హెయిర్ స్టైల్ చేయించుకుంటాయి అని మీకు తెలుసా? తెలీదు కదా! నిజంగానే హెయిర్ స్టైల్స్ ఉన్నాయ్. ఇంకా తమిళనాడులోని సింగమలం అనే ఏనుగు హెయిర్‌కట్ చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. అంత క్యూట్ ఉంది ఆ ఏనుగు. 

 

ఇంకా ఈ ఏనుగుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారట. అయితే ఈ ఏనుగు ఫోటోలను సుధా రామన్‌ అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి ట్విటర్‌లో పోస్టు చేశారు. దీంతో ఆ ఏనుగు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడులోని మన్నార్‌గుడిలో రాజగోపాలస్వామి దేవస్థానం అధికారులు 2003లో ఈ ఏనుగును కేరళ నుంచి తీసుకొచ్చారు.

 

అయితే సాధారణంగా ఏనుగులకు తలపై జుట్టు ఉండదు.. కానీ ఈ సింగమలానికి మాత్రం మనుషులకు ఉన్నట్టే జుట్టు ఉంటుంది. ఇన్క్ ఐడి కాస్త వైవిధ్యత ఉండటం వల్ల దేవస్థానం అధికారులు దాని కేశరక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. సాధారణ రోజుల్లో రోజుకు రెండు సార్లు స్నానం చేయించి తల దువ్వుతారట.  

 

ఇంకా వేసవి కాలంలో అయితే రోజుకు ముమ్మారు స్నానం తప్పనిసరిగా చేయాల్సిందే. గతంలోనూ ఈ ఏనుగు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . ఏది ఏమైనా ఏనుగు చాలా క్యూట్ గా ఉంది. మరి మీరు ఎం అంటారు? 

 

మరింత సమాచారం తెలుసుకోండి: