భారత్ లో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తున్న ఈ వైరస్ కు అంతమెప్పుడు అనే ప్రశ్నలు చాలామందిని వేధిస్తున్నాయి. మానవాళికే పెను సవాల్ విసురుతున్న వైరస్ అగ్ర రాజ్యాలను సైతం గజగజా వణికిస్తోంది. 
 
లాక్ డౌన్ ముందు పరిమిత స్థాయిలో కేసులు నమోదైన భారత్ లో అన్ లాక్ 1.0, అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరికొన్ని రోజుల్లో వైరస్ విజృంభణ ఉచ్ఛస్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైరస్ తగ్గుముఖం పట్టడానికి ఎన్ని నెలలు పడుతుందనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. 2019 డిసెంబర్ నెలలో చైనాలో ఈ వైరస్ తొలిసారి బయటపడింది. 
 
మొదట్లో ఈ వైరస్ గురించి పెద్దగా అవగాహన లేక పలు దేశాలు తీవ్ర నిర్లక్ష్యం చేశాయి. పలు దేశాలు శాస్త్రీయ విధానాలను అవలంబించి తక్కువ రోజుల్లోనే వైరస్ ను కంట్రోల్ చేయడంతో సక్సెస్ అయ్యాయి. భారత్ లో తొలి కరోనా కేసు జనవరిలో నమోదు కాగా జూన్ 2 నాటికి రోజుకు 20,000 కేసులు నమోదవుతున్నాయి. వైద్య నిపుణుల్లో కొందరు సెప్టెంబర్ లో కట్టడి చేయవచ్చని భావిస్తోంటే మరికొందరు నవంబర్ లో వైరస్ ను అంతం చేయడం సాధ్యమవుతుందని చెబుతున్నాయి. 
 
అయితే ఇప్పటివరకు చేసిన పరిశోధనల్లో కొంతమంది వైరస్ భారీన పడినా కోలుకున్నారని తేలింది. కొంతమందిలో బలమైన ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని నిపుణుల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.... రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: