కరోనా మనుషుల ప్రాణాలతో ఆడుకోవడమే కాకుండా, ఎన్నో వింతలు, విచిత్రాలను కూడా చూపిస్తుంది.. ఈ వైరస్ వల్ల లోకంలో ఎన్నడు వినకూడని, చూడకూడని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకో వలసింది కరెంట్ గురించి.. జనరల్‌గా కరెంట్ వైర్లు మనిషికి తగిలితేనే కరెంట్ షాక్ వస్తుందన్న విషయం తెలిసిందే.. అయితే ఈ మధ్యకాలంలో కరోనా వైరస్‌లా, ఈ కరెంట్ బిల్లులు కూడా ప్రజలను భయపడేలా చేస్తుంది.. ముఖ్యంగా లాక్‌డౌన్ విధించినాక విద్యుత్ వినియోగదారులకు వచ్చే బిల్లులను చూస్తే హర్ట్ వీక్ ఉన్నవారైతే అప్పటికప్పుడే హస్పిటల్ బెడ్డు ఎక్కడం ఖాయం అనిపిస్తుంది..

 

 

ఇకపోతే సాధారణంగా ఒక ఇంటికి కరెంట్ బిల్లు వస్తే ఏ 500 వందలో, వెయ్యి రూపాయల లోపుగానే బిల్లులు వస్తాయి.. కానీ హైదరాబాద్‌లోని లాలాపేట జనప్రియా అపార్ట్‌మెంట్‌లో సింగిల్‌ బెడ్రూం ప్లాట్‌లో ఉంటున్న కృష్ణమూర్తి అనే వ్యక్తికి మాత్రం ఏకంగా రూ.25 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది.. అయితే లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలల పాటు బిల్లు తీయలేదు. ఇక లాక్‌డౌన్ నిబంధనలు సడలించినాక ఆయన ఇంటి మీటర్‌కు మార్చి 6 నుంచి జూలై 6 వరకు 3,45,007 యూనిట్లకు గానూ రూ.25,11,467 బిల్లు వేశారు.

 

 

దీంతో వినియోగదారుని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తమకు సాధారణంగా కరెంట్ బిల్లు ప్రతి నెల రూ.500 నుంచి రూ.600 మాత్రమే వస్తుందని, తార్నాకలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ విద్యుత్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన అధికారులు విద్యుత్ మీటర్‌ను పరీక్షించి సాంకేతిక కారణాల వల్ల బిల్లు ఇలా వచ్చిందని పేర్కొని, ఆ ఇంటికి కొత్త మీటరు వేసి రూ.2,095 బిల్లు వసూలు చేసుకున్నారట..

 

 

విన్నారుగా లోకంలో జరుగుతున్న చిత్రాల గురించి.. ఇకపోతే మధ్యతరగతి ప్రజలకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే కానీ ఖర్చులు మాత్రం పరినితిని మించిపోతున్నాయి.. ఇక ముందు ముందు మధ్యతరగతి వారు అనే పదం మాయం అయ్యి పేదతరగతికి చేరుకుంటారేమో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: