ప్రపంచ దేశాలను చైనా వైరస్ లు గజగజా గణికిస్తున్నాయి. కొత్తకొత్త వైరస్ లు పుట్టుకొస్తూ చైనా పేరు వింటేనే టెన్షన్ పడేలా చేస్తున్నాయి. చైనా తాజాగా ప్రజలను బ్యాక్టీరియా గురించి హెచ్చరించింది. మంగోలియా స్వతంత్ర ప్రాంతంలో ఉన్న బయన్నూర్ పట్టణంలొ బుబోనిగ్ ప్లేగు కేసు నమోదైనట్లు వెల్లడించింది. ప్లేగును నియంత్రించేందుకు ఆ ప్రాంతంలో చైనా లెవెల్ 3 ఎమర్జెన్సీని ప్రకటించింది. 
 
ఇద్దరు అన్నాదమ్ములు మార్మట్ ఎలుక మీట్ తినడం వల్ల ఈ వ్యాధి సోకినట్లు తేలింది. ఈ వ్యాధి ఎలుక, ఉడతల్లాంటి జీవులను తినడం వల్ల, వాటి మాంసం తినడం వల్ల వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం వీళ్లు మంగోలియా కోడ్ ప్రావిన్సులో ఉన్న వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అధికారులు వీరిని కలిసిన 146 మందిని ఐసోలేట్ చేశారు. ఇది ఒక బ్యాక్టీరియా వ్యాధి. సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోతే ఆ వ్యక్తి కేవలం 24 గంటల్లోనే చనిపోతాడు. 
 
యూరప్ లో బుబోగిన్ ప్లేగు గురించి చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వ్యాధి సోకిన వాళ్లలో నొప్పులు, వాపు, దగ్గు, వణుకుడు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ రోగ నిరోధక వ్యవస్థలో భాగమైన శోషరస వ్యవస్థను ప్రభావితం చేసి కణుపులలో మంటను పుట్టిస్తుంది. నిత్యం జంతువులతో తిరిగే వాళ్లు, వేటకు ఎక్కువ సమయం కేటాయించేవాళ్లు, ప్లేగు వ్యాధితో ఉన్నవాళ్లను సంప్రదించిన వాళ్లు వైరస్ భారీన పడే అవకాశాలు ఉన్నాయి. 
 
సిప్రోఫోక్సాసిన్, డాక్సీసైక్లిన్ ఈ వ్యాధి నియంత్రణలో బాగా పని చేస్తాయి. కొన్ని నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా వైరస్ భారీన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. వ్యాధి సోకిన జంతువులను తాకే సమయంలో చేతికి గ్లౌవ్స్ ధరించాలి. ఎలుకలు, ఉడతలు ఇంట్లోకి రాకుండా రంధ్రాలను మూసివేయాలి. పెంపుడు జంతువులపై ఫ్లూ కంట్రోల్ స్ప్రేలను కొట్టాలి. జంతువు ఆరుబయట ఉంటే వాటిని మంచంపై పడుకోనివ్వకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: