తెలంగాణ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సచివాలయం నిర్మాణానికి సంకల్పించిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పాత సచివాలయాన్ని కూల్చివేసి అదే స్థానంలో కొత్త సచివాలయం అధునాతన  హంగులతో నిర్వహించాలని భావించింది. కానీ ప్రభుత్వం ఆలోచనకు మొదట్లోనే అడ్డుకట్ట పడిన  విషయం తెలిసిందే. తెలంగాణ సచివాలయం కూల్చివేత ను తప్పుబడుతూ ఎంతోమంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణానికి కాస్త బ్రేక్ పడింది అనే చెప్పాలి. అయితే ఆ తర్వాత హైకోర్టులో దీనిపై విచారణ జరపగా హైకోర్టు సచివాలయం నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది.


అధునాతన హంగులతో కొత్త సచివాలయం నిర్మించాలి అంటూ కోర్టు సూచించింది. దీంతో కొత్త సచివాలయం నిర్మాణానికి హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో తెలంగాణ సర్కార్ శరవేగంగా పనులు చేపట్టడంలో నిమగ్నమైంది. అయితే ఈ రోజు నుంచి పాత సచివాలయ భవనం కూల్చివేత ప్రారంభమైంది. ఆర్ అండ్ బి అధికారులు సచివాలయం కూల్చివేత పనులను చేపట్టారు . ఈ క్రమంలోనే  అటు వైపు వెళ్లే అన్ని రహదారులను మూసివేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు నిర్ణయించారు.



అయితే తాజాగా తెలంగాణ కొత్త సచివాలయం డిజైన్ విడుదల అయ్యింది. త్వరలో ఈ డిజైన్ కు సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర  వేయనున్నారు అనే టాక్ వినిపిస్తోంది. కాగా కూల్చివేతలో భాగంగా మొదట జి సి బ్లాక్ కూల్చివేయనున్నారు.  ఇకపోతే హైకోర్టు నుంచి పాత సచివాలయం కూల్చివేత కు గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ... ఇప్పటికీ కూడా కొంతమంది సచివాలయం కూల్చివేత పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: