టీలోను చాల రకాలు ఉన్నాయి. ఒక్కరకం టీ తాగడం వలన ఆరోగ్యానికి చాల మంచిది. మనకు తెలిసినంత వరకు లేమాన్ టీ, పుదీనా టీ ని ఎక్కువగా తాగుతారు. అవి తాగడం వలన శరీరానికి చాల ఉపయోగాలు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాల అవసరం. అయితే అశ్వగంధంలో ఎన్ని మౌలిక ఔషధం అని అందరికి తెలిసందే.

 

 

అయితే ఫ్లూ, ఇతర జ్వరాలతో తప్పించుకోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. దీంతో శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చునని తెలియజేశారు. అయితే, ఈ మూలికను ఇలాంటి సమయంలో మాత్రమే కాకుండా సంవత్సరం మొత్తం తీసుకోవచ్చునన్నారు. 

 

 

ఒక చెంచా అశ్వగంధ పొడిని నేరుగా మింగడానికి బదులు, మీ రోజును అదే అశ్వగంధతో కిక్‌స్టార్ట్ చేయడానికి సూపర్బ్ హెర్బల్ టీని కూడా తయారు చేసుకోవచ్చు. అశ్వగంధను ఇండియన్ జిన్సెంగ్, వింటర్ చెర్రీ అని కూడా పిలుస్తారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో జరిపిన ఒక అధ్యయనంలో, ఈ అశ్వగంధ మూలిక రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు సైతం చికిత్స చేయగలదని తెలియజేశారు.

 

 

అంతేకాకుండా, ది ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. హైపర్ కొలెస్టెరోలేమియాతో ఇన్సులిన్ ఆధారిత డయాబెటిస్ మెల్లిటస్ రోగులపై జరిపిన క్లినికల్ ట్రయల్స్ లో డబ్ల్యుయస్ నోటి హైపోగ్లైసీమిక్‌తో పోల్చినప్పుడు రక్తంలో గ్లూకోజ్ తగ్గుదల కనిపించిందన్నారు.

 

 

ఇది రోగ నిరోధక శక్తి స్థాయిలను పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుందన్నారు. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను మెరుగుపరుస్తుందన్నారు. అశ్వగంధ ఇన్సులిన్ స్రావాలను పెంచడంలో సాయపడుతుంది. క్రమంగా కండరాల కణాలలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుందిని తెలియజేశారు.

 

 

అయితే అశ్వగంధ ఒత్తిడి హార్మోన్‌ను తగ్గిస్తుందన్నారు. క్రమంగా అశ్వగంధ తీసుకున్నప్పుడు శరీరం ఉపశమనం పొందడంతోపాటు, తేలికగా అనిపిస్తుందిని తెలియజేశారు. ఫైటో మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ఈ హెర్బ్‌కు ఆందోళనా స్థాయిలను తగ్గించే సామర్థ్యం ఉందని తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: