దేశంలో కరోనా విజృభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్యా పెరుగుతూనే ఉన్నది. అయితే జీవనోపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన చాల మంది తిరిగి మళ్ళి సొంతూరుకి ప్రయాణమవుతున్నారు. దింతో నగర ప్రదేశాలలో అద్దె ఇల్లు మొత్తం ఖాళీ అవుతున్నాయి. అయితే అందుకు కారణం రెండురోజుల క్రితం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ విధించబోదని స్పష్టం చేశారు. ఇదే మాటను ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా చెప్పారన్నారు. 

 

 

ప్రజలు బెంగళూరు విడచి ఇతర గ్రామాలకు వెళుతున్నారు. దీనిద్వారా మిగిలిన జిల్లాలు, గ్రామాల్లో వైరస్‌ బెడద అధికమైంది. ప్రజలు దయచేసి బెంగళూరులోనే క్షేమంగా ఉండాలి. ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేయడం లేదు’ అని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఆదివారం కర్ఫ్యూ మాత్రం ఉంటుందని తెలియజేశారు.

 

 

బెంగళూరు నగరానికి చెందిన సమస్య మాత్రమే కాదని భారతదేశంలో అన్ని నగరాలూ ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నాయన్నారు. గత 40 ఏళ్లుగా పల్లెల నుంచి పట్టణాలకు వలసబాట పట్టిన వలస కార్మికులు ఇప్పుడు వరుస లాక్ డౌన్లతో గుండె ధైర్యం చెదిరి కుటుంబాలతో సహా మళ్లీ గ్రామాలకు చేరుకుంటున్నారు. 

 


తాజాగా ఈ పరిణామంతో హైదరాబాద్ బోసిపోతోంది. ఇప్పటికే దాదాపు 15 లక్షల మంది ప్రజలు అటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోయారని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే. నవంబర్ వరకు ఆహార ధాన్యాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో జనం దాన్ని మరోలా అర్థం చేసుకుని లాక్ డౌన్ కొనసాగుతుందనుకున్నారు. ఇక్కడ బతకాలంటే పనులు దొరకవని పట్టణాల నుంచి పల్లెటూళ్లకు వలస వెళుతున్నారు ప్రజలు.

 


దీంతో హైదరాబాద్ నుంచి గత వారంరోజులుగా లక్షలాది మంది ప్రజలు  తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. నగరంలో ఎక్కడ చూసినా టు లెట్ బోర్డులు కనిపిస్తున్నాయన్నారు. దాదాపు రెండు లక్షల అద్దె ఇళ్లు ఖాళీ అయిపోయాయని వార్తలు వస్తున్న సంగతి విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: