ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. కట్టుకున్న వారిని మోసం చేస్తూ పరాయి వాళ్ళ తో అక్రమ సంబంధానికి తెరలేపుతున్నారు. ఇంకేముంది ఇలా వివాహేతర సంబంధాల్లో కొనసాగుతున్న జంటలు చాటుమాటుగా కలుసుకునేందుకు నిర్మానుష్య ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. నిర్మానుష్య ప్రదేశాలలో కి వెళ్లి రాసలీలలు మొదలు పెడుతున్నారు.


రోజురోజుకు వివాహేతర సంబంధాల తో ఈ చాటుమాటు యవ్వారాలు  ఎక్కువైపోతున్నాయి. కొన్ని కొన్ని సార్లు ఇలా చాటుమాటు వ్యవహారాలు జరుపుతున్న  జంటలు పోలీసులకు చిక్కి అభాసుపాలు అవుతున్నారు. ఇక కొంతమంది నకిలీ పోలీసులు ఇలాంటి జంటలనే టార్గెట్గా చేసుకొని భారీగా డబ్బులు పొందుతున్నారు. తాజాగా ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది.



అయితే ఇలా ఓ జంటను  బెదిరించి నగదు బంగారం దోచుకున్న నకిలీ  పోలీసులను కీసర పోలీసులు  అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు తోసారు. నల్గొండ జిల్లా కందుకూరు మండల పరిధిలోని సీతారాంపురం సమీపంలో కోదాడ హుజూర్నగర్ రహదారి సమీపంలో పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. అయితే ప్రేమ జంటలు.. వివాహేతర సంబంధం ఉన్నవాళ్లు  ఈ ప్రదేశానికి వస్తు ఉండడంతో ఈ ప్రాంతం మొత్తం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ గా మారిపోయింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ నెల 2వ తేదీన ఓ మహిళతో కలిసి గుట్టల్లోకి  వెళ్ళాడు. వాళ్ళిద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి  పోలీస్ అంటూ  వచ్చి ఫోటోలు తీశారు.



దీంతో బెదిరింపులకు దిగాడు. అడిగినంత డబ్బు ముట్టచెప్పాలని  లేకపోతే ఫోటోలను బహిర్గతం చేస్తానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే ఏకంగా జంట  నుంచి ఐదువేల డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బులు కోసం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు, ఇక  కేసు నమోదు చేసుకున్న పోలీసులు  పోలీసుల మని చెప్పుకుంటున్న నకిలీ లను  అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోశారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: