దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని భద్రతా చర్యలు చెబుతున్నా కొంత మంది నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తీసుకు వస్తుంది. కరోనా ప్రభావం బాగా పెరిగిపోతుందని.. దాన్ని కంట్రోల్ చేయడం మన చేతిలో పని అని.. మాస్క్, సామాజిక దూరం, శానిటైజర్ లాంటి వాటితో వైరస్ నుంచి రక్షించుకోవొచ్చు అని చెబుతూనే ఉన్నారు. దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 22,252 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది.

 

అదే సమయంలో 467 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కర్ణాటక మంత్రి మధుస్వామి ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.  వైరస్‌ను కట్టడి చేయడం అధికారులకు కష్టమవుతోందని, పరిస్థితులు ఇక తమ చేతుల్లో లేవని పేర్కొన్నారు. తుమూకూరు కోవిడ్ ఆసుపత్రిలో చేరిన 8 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వారు బతికి బట్టకడతారన్న నమ్మకం లేదన్న మంత్రి.. వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని పేర్కొన్నారు.

 

ఇదిలా ఉంటే మంత్రి మధుస్వామి మాటలకు పూర్తి విరుద్దంగా వ్యాఖ్యలు చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్, వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ కూడా మంత్రి మధుస్వామి వ్యాఖ్యలను ఖండించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: