రౌడీషీటర్ వికాస్ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.వికాశ్ దూబే గ్యాంగ్‌ను పట్టుకునేందుకు నిన్న రాత్రి 16 మంది పోలీసుల బృందం వెళ్లింది. ముందుగానే పసికట్టిన ఈ ముఠా సభ్యులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.  ఈ ఘటనలో డీఎస్పీ దేవేంద్ర మిశ్రాతోపాటు ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల అనంతరం ముఠా సభ్యులు పరారయ్యారు. వికాశ్ ముఠా జరిపిన కాల్పుల్లో గాయపడిన మరో నలుగురు పోలీసులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

IHG

ఇక ఈ గ్యాంగ్ లో ఇద్దరిని ఎన్ కౌంటర్ చేశారు. ప్రస్తుతం వికాస్ దూబే కోసి 25 బృందాలు రంగంలోకి దిగినట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కాన్పూరు ఎన్‌కౌంటర్ కేసులో గ్యాంగ్ స్టర్ వికాశ్ దూబే కోడలు సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.   ప్రస్తుతం అతడి కోసం 100 ప్రాంతాల్లో పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

IHG

ఈ క్రమంలో దూబే కోడలు షమా, పొరుగింటి వ్యక్తి సురేశ్ వర్మ, పనిమనిషి రేఖలను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. కాగా, పోలీసుల రైడ్ గురించి గ్యాంగ్‌స్టర్‌కు ముందే సమాచారం అందించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న చౌబేపూర్‌ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఎస్సైలు కున్వర్ పాల్, కేకే శర్మతోపాటు కానిస్టేబుల్ రాజీవ్‌లను సస్పెండ్ చేసినట్టు కాన్పూర్ ఎస్సెస్పీ దినేశ్ కుమార్ తెలిపారు.  అంతర్గత విచారణలో వీరి ముగ్గురి పాత్ర ఉన్నట్టు తేలిందని పేర్కొన్నారు.  మరోవైపు వికాస్ దూబే ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలనే కసితో పోలీస్ అధికారులు ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: