ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. కొన్ని వేల మంది ఈ మహమ్మారితో బాధపడుతున్నారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ మహమ్మారితో అన్ని దేశాలు పోరాటాలు చేస్తున్న సంగతి విదితమే. అయితే ఈ వైరస్ ప్రభావం దేశంలోను ఎక్కువగానే ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే ఈ మహమ్మారి వచ్చి ఎన్ని నెలలు గడుస్తున్నా దీనికి సరైన వ్యాక్సిన్ కనుకోలేదు. 

 

 

ఈ మహమ్మారి కరోనా వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్  ను తయారు చేసేందుకు ప్రపంచంలోని చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నా సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొన్ని కంపెనీలు ఇప్పటికే వ్యాక్సిన్ కు సంబంధించి మానవ ట్రయల్స్ ను సిద్ధం చేశాయి. అయితే గిలీడ్ ఫార్మా కంపెనీ ఇప్పటికే రెమ్ డెసివిర్ ను సిద్ధం చేసింది.

 

 

ఈ వ్యాక్సిన్ ను జనరిక్ ఔషధంగా మార్చి విక్రయించేందుకు డిసిజీఐ  అనుమతి పొందిందన విషయం విదితమే. ఇండియాలో ఈ ఔషధాన్ని అమ్మెందుకు సిప్లా, హెటిరో కంపెనీలు లైసెన్స్ లు పొందాయన్నా సంగతి తెలిసిందే. ఇప్పుడు మైలాన్ ఫార్మా కూడా అనుమతి పొందిందన్నారు. 

 

 

ఈ వ్యాక్సిన్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటదా అనే సందేహాలు ఎక్కవగా వినపడుతున్నాయి. అయితే, సిప్లా ఈ మెడిసిన్ ను రూ.5000 వరకు విక్రయించేందుకు రెడీ అవుతుంది. హెటిరో ఫార్మా రూ. 5400 వరకు విక్రయించేందుకు రెడీ అయ్యింది.  ఇక  మైలాన్ ఫార్మా అందరికి అందుబాటులో ఉండే విధంగా 100 మిల్లి గ్రాముల వయల్ ధరను కేవలం రూ. 4800 కే మార్కెట్లోకి తీసుకురాబోతున్నది.

 

 

గిలిద్ ఫార్మా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక్కో వయల్ ను 2400 డాలర్లకు అమ్ముతున్న సంగతి విదితమే. ఇండియాలో తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడం విశేషం. మైలాన్ కంపెనీ తయారు చేసే రెమ్ డెసివిర్ ను 127 దేశాల్లో విక్రయించబోతున్నదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: