జియో, ఎయిర్టెల్ యూజర్లకు ఇక్కట్లు తప్పవు. ఇప్పటి నుంచి రీఛార్జ్ చేసుకోవాలంటే చుక్కలేనట. అయితే టెలికం యూజర్లకు ఝలక్ ఇస్తున్నాయి. టారిఫ్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందంటూ నివేదికలను వెలువడుతున్నాయి. దీని కారణంగా ఇక పై రీఛార్జ్ ధరలు పెరుగుతాయని అంచనాలు వేస్తున్నాయి. దీనితో ఫోన్ బిల్లులు భారీగా పెరుగుతాయని చెప్తున్నారు. మీరు ఎయిర్టెల్ లేదా జియో సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారా...? అయితే  జియో కస్టమర్స్ కి , ఎయిర్టెల్ వినియోగదారులకి, వోడాఫోన్ ఐడియా ఉపయోగిస్తున్న వారికి ఇక్కట్లు తప్పవు. టెలికం కంపెనీలు చుక్కలు చూపించబోతున్నారు. వీళ్ళు టారిఫ్ ధరలు పెంచే పనిలో ఉన్నారట. 

 

అయితే టెలికాం రంగం లాభ దాయక ఏమీ బాగోలేదు. నష్టాల్లోనే టెలికాం రంగం కొట్టుమిట్టాడుతోంది. ఇందు కారణం గానే టెలికాం కంపెనీలు ధరని పెంచే అంచనాలు వేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఫోన్ కాల్స్ ఇంటర్నెట్ బిల్స్ కూడా రెండు రెట్లు పెరిగి పోతాయని అంచనాలు వేస్తున్నాయి. తొలి విడత పెంపు వచ్చే ఆరు నెలల కాలం లో ఉండొచ్చని అంచనా వేసింది. అయితే వచ్చే 12 నుంచి 18 నెలల కాలం లో ఫోన్ కాల్స్ డేటా ధరలు రెండు సార్లు పెరగ వచ్చని అంటున్నారు. ఈవై లీడర్ ప్రశాంత్ సింగల్ టారిఫ్ ధరలు పెంచాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొల్పాయని తెలియజేశారు. 

 

ఇదిలా ఉండగా టెలికం కంపెనీల ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలంటే కచ్చితంగా టారిఫ్ ని పెంచాలని వాళ్లు కూడా అభిప్రాయ పడుతున్నారు. దీని మూలం గానే రానున్న రోజుల్లో ధరలు భారీగా పెంచాలని అంచనా వేస్తున్నారు. టెలికాం సంస్థలు గత ఏడాది డిసెంబర్ నెలలో టారిఫ్ ధరలు పెంచాయి. తిరిగి మళ్ళీ టారిఫ్ ధరల్ని పెంచుతారని చెబుతున్నారు. రెండు రెట్లు కనుక పెరిగిపోతే వినియోగదారులకి చుక్కలే .

మరింత సమాచారం తెలుసుకోండి: