దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,19,665 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 20,160కి పెరిగింది. 2,59,557 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,39,948 మంది కోలుకున్నారు. ఇటీవల లాక్ డౌన్ చేసినప్పటి నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో సామాజిక దూరం నిబంధనలు కచ్చితంగా పాటించాలని, పార్టీలకు దూరంగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇదే విషయాన్ని గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు.  ఆయన అలా అభ్యర్థించి ఒక్క రోజైనా కాకముందే ఆ పార్టీ ఎమ్మెల్యే టిక్లో ఓ పార్టీకి హాజరు కావడం గమనార్హం.

 

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, ఎమ్మెల్యేపై విమర్శల వర్షం కురుస్తోంది. బీజేపీ కౌన్సిలర్ ఫ్రాన్సిస్కో కర్వాలోతోపాటు కొందరు యువకులు ఓ హోటల్ గదిలో పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేసినట్లు సమాచారం.  పార్టీకి హాజరైన ఎమ్మెల్యే చేతులు ఊపుతూ, కరచాలనం చేశారు. ఈ పార్టీపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎమ్మెల్యే స్పందించారు. తన సన్నిహిత మిత్రుడొకరు పిలిస్తే పార్టీకి వెళ్లానని, అక్కడ తానున్నది కొన్ని నిమిషాలేనని సమర్థించుకున్నారు.

 

తాము సామాజిక దూరం పాటించామని.. దీన్ని బూతద్దంలో పెట్టి చూడొద్దని అన్నారు.  ఈ పార్టీలో దాదాపు 40 మంది వరకు పాల్గొన్నట్టు వీడియోను బట్టి తెలుస్తోంది.  ఇక  ఈ పార్టీలో పాల్గొన్న బీజేపీ కౌన్సిలర్ ఫ్రాన్సిస్కో మాట్లాడుతూ.. పార్టీకి అనుమతి ఉందని పేర్కొన్నారు. ‘లాక్‌డౌన్ పార్టీ’పై విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించనున్నట్టు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: