దేశంలోని చాలామంది ముఖ్యమంత్రులకు భిన్నం తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. మిగిలిన వారి మాదిరి ఆయన అదే పనిగా.. రోజువారీగా కనిపించే అలవాటు మొదట్నించి లేదు. ఉద్యమ నేతగా సుదీర్ఘకాలం రాజకీయాన్ని నడిపిన ఆయన.. మిగిలిన ఉద్యమ అధినేతలకు భిన్నంగా వ్యవహరించేవారు. అప్పుడప్పుడు మాత్రమే బయటకు వచ్చేవారు. అదే పనిగా మాట్లాడేవారు కాదు. కాకుంటే మీడియా ముందుకు వచ్చినా.. ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా.. అందుకు తగ్గ లెక్కలు ఉండేవి.

 

ఎట్టకేలకు తన కలల పంట అయిన తెలంగాణను సాధించే విషయంలో ఆయన విజయవంతం కావటం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్.. ముఖ్యమంత్రి హోదాలోనూ తన మార్కును ప్రదర్శిస్తున్నారు. సచివాలయానికి వెళ్లకుండా ఇంటి నుంచి ఆ మాటకు వస్తే.. ఫాంహౌస్ నుంచి పాలన చేస్తున్న వైనం కనిపించక మానదు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే మాత్రం.. పనులైతే జరుగుతున్నాయి కదా ? అయినా..సీఎం ఎక్కడ ఉంటే అదే సీఎంవో అంటూ తేల్చేసి.. తనను వేలెత్తి చూపించే వారి నోళ్లను మూయించేశారు.

 

రోజుల తరబడి అధికారిక కార్యక్రమాల్లో కనిపించకుండా ఉండే కేసీఆర్ మీద ఎప్పుడు జరగని కొత్త ప్రచారం తాజాగా సాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ను మహమ్మారి సోకినట్లుగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొన్ని గ్రూపుల్లో అయితే.. ఇదే విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి కూడా. అప్పుడప్పుడు మాత్రమే కనిపించే కేసీఆర్ మీద ఈసారే ఎందుకు ఇలాంటి ప్రచారం సాగుతోందన్నది ఒక ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: