రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు చాలావరకూ రైతులను ఆకర్షించే విధంగా పలు పథకాలను అమలు చేస్తూ పరిపాలన చేస్తున్నారు. తెలంగాణలో రైతు బంధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ రైతు భరోసా ఈ విధంగా రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వాలు ఈ పథకాల ద్వారా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పుడు ఇదే విధంగా ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఒక డిఫరెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేమిటంటే జూలై 20 నుంచి రాష్ట్రంలో గోధన్ న్యాయ్ యోజన పథకం పేరిట గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి పేడను కొనుగోలు చేయాలని డిసైడ్ అయింది.

IHG

ఈ పథకం ద్వారా ఆవుపేడను ఒక కిలో కి రూ.1.50 కి కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఛత్తీస్ గఢ్ రైతులు హరేలీ పండగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జూలై 20 వ తారీఖున పండుగ వచ్చిన నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల కోసం గోధన్ న్యాయ్ యోజన పధకాన్ని ప్రారంభించనుంది. గ్రామీణ ప్రాంత ప్రజల నుండి ఆవుపేడను కొనుగోలు చేసి ప్రభుత్వం వర్మీ కంపోస్ట్‌ను తయారు చేయనున్నట్లు సమాచారం.

IHG

ప్రతి ఇంటికి సహాయక బృందాలు వెళ్లి ఆవుపేడను కొనుగోలు చేసి వాటి వివరాలను లెక్కించి ప్రతి 15 రోజులకు ఓసారి ఆన్ లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. ఇదిలా ఉండగా ఇదే పథకం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెడితే కచ్చితంగా రైతులకు భారీ స్థాయిలో డబ్బులు వస్తాయని ప్రభుత్వం ప్రజలకు మేలు చేసినట్లవుతుందని మేధావులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: