దాదాపు 70 సంవత్సరాల వయసు కలిగిన చంద్రబాబు పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి అనేక వ్యూహాలు వేస్తూ పోరాటం చేస్తున్నారు. భారీ మెజార్టీతో అధికారంలో ఉన్న వైసీపీ ని తన తెలివితేటలతో ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న గాని నాయకుల నుండి సరైన విధంగా రెస్పాండ్ రాకపోవటంతో ఇటీవల చంద్రబాబు అసహనం చెందారట. ఈ వయసులో కూడా నేను యాక్టివ్ గా పోరాడుతుంటే పార్టీ నుండి సరైన సపోర్ట్ లేకపోతే నేను ఏమి చేయగలను అని చంద్రబాబు పార్టీ పెద్దలతో అన్నట్లు సమాచారం.

IHG' criticism of party's alliance with <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ALL INDIA NATIONAL CONGRESS' target='_blank' title='congress-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>congress</a> ...

ముఖ్యంగా వందకు పైగా నియోజకవర్గాల్లో కనీసం నాయకులు ఎవరు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో గాని పార్టీ కార్యకర్తలకు ఏదైనా జరిగితే అండగా ఉండటంలో గాని శ్రద్ధ చూపటం లేదట. స్వయంగా బాబు నాయకుల పనితీరుపై సర్వే చేయించి నివేదిక తెప్పించుకున్నాక కార్యకర్తలకు కూడా నాయకులు అండగా లేకపోవడంతో వివిధ నియోజకవర్గాలలో గ్రూపు రాజకీయాలు తెలుసుకుని బాబు బాధ పడ్డారట.

IHG's 40% Is Bigger Than Those 23 MLAs - ManaTeluguMovies.net

దీంతో నాయకుల పనితీరు మార్చుకోకపోతే త్వరలో కొత్త ఇన్చార్జిలను నియమించాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు అంట. ముఖ్యంగా కింద ఉన్న క్యాడర్ కి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినా సరైన పోరాటాలు రాష్ట్రంలో జరగకపోవడంతో చంద్రబాబు చేసిన ఈ సర్వేలో కేవలం ముగ్గురు నలుగురు నాయకులు మాత్రమే అది కూడా కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళు మాత్రమే వైసీపీని దీటుగా ఎదుర్కొంటున్నారు అట. దీంతో త్వరలోనే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్చార్జిల విషయంలో కొత్త నియామకాలు చంద్రబాబు నియమించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: