దేశీయ స్టార్టప్‌లపై కోవిడ్‌ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏకంగా 70 శాతం వ్యాపారం తీవ్రంగా దెబ్బతిందని 250 స్టార్టప్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి. అనూహ్యమైన పరిస్థితుల రీత్యా తమ కార్యకలాపాలను నిలిపివేశామని తెలిపాయి కొన్ని స్టార్టప్‌లు. కరోనా -19 ప్రభావం పేరుతో ఫిక్కీ, ఇండియన్‌ ఏంజెల్‌ నెట్‌వర్క్‌ ఉమ్మడిగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయ్‌.

 

ఇండియాలో పెట్టుబడులకు కరోనా సెగ తగులుతోంది. రానున్న 3-6 నెలల్లో 22 శాతం స్టార్టప్‌ల వద్ద మాత్రమే వ్యాపారలావాదేవీలు నిర్వర్తించే సామర్ధ్యం కలిగి ఉన్నాయని తెలిపింది సర్వే. కరోనా ప్రభావంతో తమ కార్యకలాపాలను నిలిపివేశామని 12 శాతం స్టార్టప్‌ విచారం వ్యక్తం చేశాయ్‌. తీవ్రమైన ఇబ్బందులతో కార్యకలాపాలతో ఇబ్బందులను కొనసాగిస్తున్నామని 60 శాతం స్టార్టప్‌లు తెలిపాయి. 

 

పెట్టుబడుల పరంగా చూస్తే కొంతకాలం నిలుపుదల చేయాలని 33 శాతం స్టార్టప్‌లు భావిస్తున్నాయ్‌. పది శాతం పైన స్టార్టప్ కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేసుకున్నారని సర్వే ఫలితాల్లో వెల్లడయ్యాయ్. పెట్టుబడులను నిలుపుదల చేయడంతో తమ వ్యాపార అభివృద్ధి, తయారీ కార్యకలాపాలను పక్కనపెట్టాల్సి వస్తోందన్నాయి. ఫలితంగా ప్రాజెక్ట్‌ ఆర్డర్లను కోల్పోతున్నామని స్టార్టప్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి.

 

250 స్టార్టప్‌లు మాత్రమే కాకుండా 61 ఇంక్యూబేటర్లు, ఇన్వెస్టర్లు పాల్గొన్న ఈ సర్వేలో.. కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉందని తెలుస్తోంది. రానున్న ఆరు నెలల్లో తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నామని 92 శాతం మంది పెట్టుబడిదార్లు తెలిపారు. కోవిడ్‌ సంక్షోభం కంటే ముందు పరిస్థితితో పోల్చితే.. హెల్త్‌కేర్‌ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టాలని 35 శాతం మంది పెట్టుబడిదారులు భావిస్తున్నారని తెలిపింది ఫిక్కీ.

 

ఉద్యోగులను తొలగించడం తప్ప వేరే మార్గం లేదన్న కంపెనీలు మరోవైపు.. కరోనా మహమ్మారి ఇంకా పెరిగితే.. ఉద్యోగులను తొలగించడం తప్ప వేరే గత్యంతరం లేదని చాలా కంపెనీలు తెలుపుతున్నాయ్‌. ఇప్పటికే దాదాపు 43 శాతం స్టార్టప్‌లు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించినట్టు సర్వేలో తెలిసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: