తాజాగా కొత్త సర్వీసులని ఆవిష్కరించిన కోటక్ మహేంద్ర బ్యాంక్. దీనితో సులభంగా రుణం అందించడానికి రెడీ అయ్యింది. డెబిట్ కార్డ్ పై ఈఎంఐ ఫెసిలిటీ ని కూడా మీరు వినియోగించుకోవచ్చు. తక్షణమే మీ రుణాన్ని కూడా పొందవచ్చు. కోటక్ మహేంద్ర బ్యాంక్ కొత్త సర్వీసును ప్రారంభించింది. దీనితో  కస్టమర్లకి శుభవార్త అందించింది. అయితే కోటక్ డెబిట్ కార్డ్స్ తో  ఈఎంఐ ఫెసిలిటీ అందిస్తామని కోటక్ మహేంద్ర బ్యాంక్ ప్రకటించింది. ఈ తాజా నిర్ణయం తో చాలా మందికి ఊరట లభించింది . కోటక్ డెబిట్ కార్డు పై ఈఎంఐ ఫెసిలిటీ తో పాటు ఇనోవేటివ్ పి ఓ ఎస్ టర్మినల్స్ వద్ద స్వైప్ చేసిన కార్డులకి బెనిఫిట్ వర్తిస్తుంది.

 

దీని ద్వారా ఇప్పుడు కోటి మందికి పైగా కస్టమర్లు వారి కొనుగోలుని డెబిట్ కార్డు ద్వారా సులభంగా చేయించుకోవచ్చు. అయితే దీని ద్వారా వివిధ పట్టణాల్లో 70 వేలకు  పైగా ఇన్నోవిటి టర్మినల్స్ అందుబాటు లో ఉన్నాయి అని చెప్పింది కోటక్ మహేంద్ర బ్యాంక్ . అలానే కోటక్ మహేంద్ర బ్యాంక్ కస్టమర్ లెవల్ డెబిట్ కార్డుల పై ఈ అవకాశం ఉందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు .

 

5676788 నెంబర్కు డి సి ఈఎంఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి డెబిట్ కార్డ్ చివరి నాలుగు నంబర్లు ఎంటర్ చేసి ఎస్ఎమ్ఎస్ పంపాలి. దీని ద్వారా మీ లిమిట్ ఎంత ఉందో మెసేజ్ వస్తుంది. మీరు ఏమైనా కొనుగోలు చేసుకునే ముందు ఈఎమ్ఐ ఆప్షను ఎంచుకోవాలి. ఎన్ని నెలలు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటున్నారో చెప్పాలి. అంటే కార్డును ఇన్నోవిటీ పీఓఎస్ టర్మినల్ ‌లో స్వైప్ చేయాలి. వెంటనే ఇన్‌స్టంట్ లోన్ వచ్చేస్తుంది. అయితే ఇన్స్టెంట్ లోన్ ఎంతో తెలుసుకోవడానికి ఈ  ప్రాసెస్ లో మీరు చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: