గల్వాన్‌లో సైనికుల విరమరణం తర్వాత మరోసారి అటువంటి ఘటనలు జరగకుండా పగడ్బందీ చర్యలు చేపడుతోంది భారత్. సరిహద్దుల్లో సైనికులు క్షణాల్లో అనుకున్న చోటికి చేరేందుకు ముమ్మరంగా రోడ్ల నిర్మాణాలను చేపడుతోంది. బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిర్మాణాలను గత నాలుగేళ్లలో మూడు రెట్లు ఖర్చు ఎక్కువ పెట్టి మరీ నిర్మిస్తోంది.

 

సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం పనులను ముమ్మరంగా చేపడుతోంది భారత్. సైన్యం వెళ్లేందుకు వీలుగా... అదే సమయంలో స్థానిక అవసరాల నిమిత్తం సరిహద్దుల్లో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. 2016 వరకు దశాబ్ద కాలంలో గడిపిన ఖర్చుతో పోల్చితే గత నాలుగేళ్లలో చైనా సరిహద్దు వెంబడి చేపట్టిన రోడ్లపై భారత్ తన ఖర్చును దాదాపు మూడు రెట్లు పెంచింది. ఫలితంగా రోడ్లు, వంతెనలు గణనీయంగా మెరుగుపడ్డాయ్‌. 

 

2013-20 కాలపరిమితిలో ఎల్‌ఏసీ వెంట గుణాత్మక, పరిమాణాత్మక పరంగా భారతదేశం పదునైన పెరుగుదలను చూసింది. ఈ కార్యకలాపాలకు గణనీయమైన రాజకీయ ఉత్సాహం కూడా లభించింది. ఎల్ఏసీ నుంచి 100 కిలోమీటర్ల వైమానిక దూరం లోపల రహదారుల నిర్మాణానికి 2014 జూలై నెలలో ఆమోదం లభించింది. ఈ రహదారుల నిర్మాణానికి ప్రధానంగా బాధ్యత వహిస్తున్న బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్ జనరల్ కు ఆధునిక పరికరాల సేకరణకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఫలితంగా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మంచు కట్టర్లు, హెవీ ఎక్స్‌కేవేటర్లు, కొత్త ఉపరితల సాంకేతిక పరిజ్ఞానాన్ని మోహరించింది.

 

వ్యూహాత్మక ప్రాజెక్టుల్లో భారత్.. అరుణాచల్ ప్రదేశ్ లోని సే లా సొరంగం పూర్తి చేయబోతుంది. ఈ సొరంగం పూర్తయిన తర్వాత చైనా సరిహద్దుకు సమీపంలో వ్యూహాత్మకంగా ఉన్న జిల్లా అయిన తవాంగ్‌లో వేగంగా దళాల కదలికలు చేపట్టేందుకు అవకాశం దొరుకుతుంది. 2008-14 మధ్యకాలంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో 3 వేల 610 కిలోమీటర్ల రోడ్లు పూర్తవగా.. ప్రస్తుత ఎన్‌డీఏ పాలనలో 4 వేల 764 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తయ్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: