లాక్‌డౌన్ స‌మ‌యంలో మ‌న‌మంతా బాధ‌ప‌డింది వ‌ల‌స కూలీల విష‌యంలో. లాక్ డౌన్ స‌మ‌యంలో ప‌ని లేక‌పోవ‌డం, న‌గ‌రాల్లో జీవించే వీలు కాని స‌మయంలో కూలీలు త‌మ స్వ‌గ్రామాల‌కు వెళ్లిపోయారు. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్ విధించగానే నగరాల్లో తినడానికి, ఉండటానికి కష్టమైన రోజువారీ కూలీలు పెద్ద ఎత్తున తమ సొంత ప్రాంతాలకు తరలివెళ్లారు. తరలిపోతోన్న వలస కూలీలను వెళ్లకుండా ఆపడంలో ప్రభుత్వాలు చాలా వరకు విఫలమయ్యాయి. చాలా మంది వందల కిలోమీటర్లు నడిచి సొంత ఊర్లకు చేరుకున్నారు. ఇప్పుడు ఎకానమీ రీఓపెన్ అయిన తర్వాత, వారిని నగరాలకు రప్పించడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇక్క‌డే ఊహించ‌ని ట్విస్ట్ తెర‌మీద‌కు వ‌చ్చింది.

 

 


న‌గరాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో, వారు తిరిగి వచ్చేందుకు భయపడుతున్నారు. దీంతో లేబర్ కొరత ఏర్పడింది. దీంతో, వలస కూలీలను మళ్లీ వెనక్కి రప్పించడం కోసం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఉచితంగా ట్రావెల్ టిక్కెట్లను అందివ్వడంతో పాటు ఇళ్ల సదుపాయాలను, ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కార్మికులకు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్ తర్వాత తిరిగి ప్రారంభమైన వ్యాపారాలను నిర్వహించడానికి కూలీలు లేకపోవడంతో, కొన్ని కంపెనీలు, సమీప ప్రాంతాల్లో ఉన్న కొత్త వారిని నియమించుకుంటున్నాయి. కార్మికులకు తిరిగి పని ప్రాంతాలకు వచ్చేందుకు ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, ఇతర ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్నామని లిన్ఫోక్స్ లాజిస్టిక్స్ ఇండియా కంట్రీ మేనేజర్ వీ.వీ వేణుగోపాల్ చెప్పారు. వలస కూలీలు రావడం ఆలస్యమవుతుండటంతో, తిరిగి పనులు ప్రారంభించేందుకు కొత్త వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా నియమించుకుంటున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా వర్కర్లకు బస్సులు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టేషన్ సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.

 

 


కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో లేబర్ కొరత ఏర్పడిందని, ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆలస్యమవుతున్నట్టు కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన మహారాష్ట్ర యూనిట్ ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ అన్నారు. విమానాల్లో అయినా వర్కర్లను వెనక్కి రప్పించడం కోసం తాము చూస్తున్నట్టు చెప్పారు. పలు ప్లాంట్లలో పనిచేసేందుకు 500 మంది వలస కార్మికులను నియమించుకున్నట్టు ఆసియాలోనే అతిపెద్ద ప్లేవుడ్ మాన్యుఫాక్చరింగ్ హబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకటైన సద‌రన్ ప్లేవుడ్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ ఎంకే హన్ష చెప్పారు. తిరిగి  వచ్చే కూలీలకు ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, ఇతర ప్రోత్సహకాలను ఆఫర్ చేస్తున్నానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: