ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే దాదాపు వందేళ్ల కిందట ఇవే లక్షణాలతో ఇన్ ఫ్లూయెంజా నుమోనియా అనే వైరస్ బెంగళూరు నగరాన్ని గజగజా వణికించింది. అప్పటి మున్సిపల్ కౌన్సిల్ అధికారి జేవీ మస్కరెన్హాస్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో జబ్బు లక్షణాలతో పాటు ఔషధ చికిత్సలను వివరించారు. 
 
ఆ పురాతన పత్రాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. 1918లో కరోనా మహమ్మారి తరహా లక్షణాలైన జలుబు, జ్వరం, దగ్గుతో ప్రజలు బాధ పడినట్లు వ్యాధి ముదిరితే న్యూమోనియాగా మారినట్లు అధికారులు గుర్తించారు. ఆ కాలంలో ప్రజలు ఒకే ప్రదేశంలో గుంపులుగా చేరకూడదని.... జలుబు చేసిన వారికి దూరంగా ఉండాలని.... రాత్రీపగలు స్వచ్చమైన గాలి వీచే స్థలంలో మాత్రమే ఉండాలని.... దేహానికి, మనసుకు అలసట రాకుండా పనులు చేయరాదని నిబంధనలు ఉన్నాయి. 
 
జ్వరం, జలుబు లక్షణాలతో బాధ పడుతూ ఉంటే గది కిటీకీ తలుపులు తెరిచే విధంగా చూసుకోవాలని.... సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి ఔషధాలను తీసుకోవాలని.... అమ్మోనైటేడ్ క్వినైన్ అనే ఔషధాన్ని అత్యవసర పరిస్థితుల్లో సేవించాలని..... లవంగం, మిరపకాయ, అల్లం, వెల్లుల్లితో తయారు చేసిన ఔషధాన్ని తీసుకోవాలని ఆ కాలంలో సూచించారు. మరోవైపు దేశంలో, తెలుగు రాష్ట్రాలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 


మరోవైపు ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,178 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో రాష్ట్రానికి చెందిన కేసులు 1,155 కాగా ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు 23 మంది వైరస్ భారీన పడ్డారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 16,238 శాంపిల్స్ ను పరీక్షించినట్టు ప్రభుత్వం ప్రకటన చేసింది.                           

మరింత సమాచారం తెలుసుకోండి: