దేశంలో ఏమంట కరోనా కేసులు పెరిగిపోతున్నాయో కానీ మనిషికి కంటిమీద కునుకు లేకుండా పోతుంది. దేశంలో ఇప్పటికే క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665కి చేరుకున్న‌ది. భార‌త్‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు ల‌క్ష‌లు దాటింది.  దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 22,252 కేసులు న‌మోదు అయ్యాయి.  24 గంట‌ల్లోనే దేశ‌వ్యాప్తంగా 467 మంది మ‌ర‌ణించారు.   ఈ ఎఫెక్ట్ కాస్త  ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగస్తులపై పడుతున్న విషయం తెలిసిందే. వారితోపాటుగా పెన్షన్ తీసుకునే వారు కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు కరవు భత్యం (డీఏ) నిలిపివేసింది. 2021 జూలై వరకు ఈ నిలిపివేత వర్తిస్తుందని తెలిపింది.

 

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నాయని..  అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కూడా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు కరవు భత్యాన్ని నిలిపివేసింది. 

 

కాగా, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు తాజాగా హర్యానా ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు డీఏను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూడా సగం జీతం ఉద్యోగులకు.. మూడో వంతు పెన్షనర్లకు ఇచ్చిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: