ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎవరి నోట విన్నా ఒక్కమాటే.. కరోనా. ఈ కరోనా మానవ జీవన శైలి పూర్తిగా మార్చి వేసింది. మనిషి ప్రాణాలు మాత్రమే కాదు.. ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసింది. కరోనా సోకిన వారిని కనీసం మనిషిగా అయినా చూడటం లేదు.. ఇక కరోనాతో మరణించిన వారి పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది.  అంతగా భయపెడుతున్న కరోనా కొన్ని దేశాల్లో లేదని అంటే నమ్ముతారా..? అవును కొన్ని దేశాల్లో కరోనా కేసలు లేవు. కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వైరస్ ని జయించిన వారు కూడా ఉన్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు 190కు పైగా దేశాలు వణికిపోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 188 దేశాలకు వైరస్‌ విస్తరించింది.

 

 ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,15,56,641 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల 5,36,776 మంది చనిపోయారు. ఇప్పటివరకు ఈ వైరస్‌ భారినపడినవారిలో 65,34,851 మంది కోలుకోగా, మరో 44,85,014 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.   అగ్రరాజ్యం అమెరికాలో నిన్న 40వేలకు పైగా కేసులు నమోదవడంతో మొత్తం కరోనా కేసులు 30 లక్షలకు చేరువలో ఉన్నది. దేశంలో ఇప్పటివరకు 29,82,928 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

 

ఈ వైరస్‌ వల్ల 1,32,569 మంది మరణించారు. లాటిన్‌ అమెరికా దేశమైన బ్రెజిల్‌లో కరోనా కేసుల సంఖ్య 16,04,585కు చేరింది. ఇప్పటివరకు 64,900 మంది మరణించగా, 561,070 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా అన్న మాటవినపడని ప్రదేశాలు..  వీటిలో చాలా వరకు చిన్న దేశాలు(ద్వీపాలు) కావడం, విదేశీ రాకపోకలు లేకపోవడం వల్ల కరోనా దరిచేరలేదు.  చైనాతో సరిహద్దును పంచుకునే ఉత్తర కొరియాలో కోవిడ్‌-19 కేసులు నమోదైనట్లు వార్తలు బయటకి రాలేదు.  కిరిబతి , మార్షల్‌ ఐలాండ్స్‌, మైక్రోనేషియా, నౌరు,  ఉత్తర కొరియా, పలావు,  సమోవ,  సాల్మన్‌ ఐలాండ్స్‌,  టోంగా,  తుర్క్‌మెనిస్థాన్‌,  తువాలు,  వనాటు లో కేసులు లేవని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: