గత నెల 15వ తేదీన చైనా భారత్ దేశాల ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో భారత్ కు చెందిన 21 మంది సైనికులు మృతి చెందారు. మన దేశానికి చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు ఇతర సైనికులు చైనా కుట్రపూరితంగా వ్యవహరించడంతో చనిపోయారు. అయితే మన సైనికులు కూడా కల్నల్ సంతోష్ మృతితో తీవ్ర ఆగ్రహానికి గురై చైనా సైనికులపై దాడి చేశారు. 
 
ఆ సందర్భంగా భారత్ సైనికులు చేసిన దాడిలో చైనా సైనికులు కూడా భారీ సంఖ్యలో చనిపోయారని వార్తలు వచ్చాయి. అయితే మృతులకు సంబంధించిన వివరాలను చైనా అధికారికంగా ప్రకటించలేదు. చైనా సైనికుల ఆయుధాలతోనే వాళ్లను మన దేశ సైనికులు మట్టుబెట్టారని వార్తలు వచ్చాయి. అయితే మృతి చెందిన సైనికుల వివరాలు చెప్పకపోవడంతో చైనా దేశంలోని ప్రజల్లోనే ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 
 
చనిపోయిన జవాన్లకు భారత్ లో దక్కిన గౌరవం చైనాలో దక్కడం లేదని అక్కడి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన నాయకుడు జియాన్ లియాంగ్ 148 చైనా సైనికులు జరిగిన దాడిలో చనిపోయారని చెప్పారు. ఈ ప్రకటన ఆ దేశంలో సంచలనమే సృష్టిస్తోంది. ఘర్షణల్లో తీవ్ర గాయాలపాలైన సైనికులు సైతం చికిత్స పొందుతూ మరణించారని తెలుస్తోంది. 
 
చైనాలో దాదాపు నాలుగు మిలిటరీ ఆస్పత్రులు నిండిపోయాయని గతంలో వార్తలు వినిపించాయి. ఈ ప్రకటన తరువాతైనా చైనా అధికారికంగా లెక్కలు చెబుతుందా....? లేకపోతే భవిష్యత్తులో చెబుతుందా....? చూడాల్సి ఉంది. భారత్ లో చనిపోయిన సైనికుల కంటే చైనాలో చనిపోయిన సైనికుల సంఖ్య ఏడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. మరోవైపు ఇరు దేశాల మధ్య కుదిరిన అంగీకారం ప్రకారం సైన్యాలు వెనక్కు వెళుతున్నాయి. చైనా సైనికులు 2 కిలోమీటర్ల మేర వెనక్కు వెళ్లగా భారత్ సైనికులు 1.5 కిలోమీటర్ల మేర వెనక్కు వెళ్లినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: