కరోనా.. కరోనా.. కరోనా.. దీన్ని ఆపేదెలా.. వ్యాక్సీన్ కోసం చూద్దామంటే.. ఏడాది పైగానే సమయం పట్టేట్టుంది..మరి అప్పటి వరకూ ప్రాణాలు నిలబెట్టుకునేదెలా.. అందుకే అందుబాటులో ఉన్న మందులన్నీ ప్రయత్నించి చూస్తున్నారు. మొదట్లో హైడ్రాక్సీ క్లోరోక్వీన్ పని చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత దానికి అంత సీన్ లేదని తేల్చారు. అయినా ఇప్పటికీ అనేక చోట్ల వాడుతున్నారు. 

 


ఆ తర్వాత.. అనేక కంపెనీలు.. అనేక మందులను తెరపైకి తెచ్చాయి. ఇవన్నీ వైరస్ లపై ఇప్పటికే వాడుతున్న మందులు.. వీటిలో ఏదైనా పని చేయకపోతుందా అన్న ఆశతో ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇలాంటి సమయంలో చైనా ఓ ఇంట్రస్టింగ్ వార్త చెప్పింది. ఓ చౌక మందు కరోనాను బాగా అడ్డుకుంటోందని ప్రకటించింది. ఆ మందు పేరేటోం తెలుసా.. అదే.. మెటాఫార్మిన్.

 

 

IHG


వాస్తవానికి ఇది కొత్తదేమీ కాదు.. సుగర్ పేషెంట్లు వాడుతున్న టాబ్లెట్.. ఇది చాలా చౌక. ఎంత చౌక అంటే.. ఒక టాబ్లెట్‌ ధర 30 పైసల నుంచి రూపాయకి మించదు. అయితే ఇది కరోనాను బాగా అడ్డుకుంటోందని చైనా చెబుతోంది. చైనా సంగతి తెలుసు కదా. కరోనా వైరస్ విషయంలో దాన్ని మించిన ఎక్స్‌పర్ట్ లేదు. ఇప్పుడు వుహాన్‌లో ఈ మందు ఎక్కువగా వాడుతున్నారట. 

 


సాధారణంగా సుగర్ వ్యాధిగ్రస్తులకు కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. ఎందుకంటే వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని.. కానీ.. ఈ మెటాఫార్మిన్ వాడే వారిలో చాలా మంది కరోనా బారిన పడినా.. సులభంగా కోలుకున్నారట. ఈ టాబ్లెస్ వాడని సుగర్ రోగుల్లో కరోనా మృతులు ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి వ్యాక్సీన్ వచ్చే వరకూ ఇలా ఏదో ఒక మందును నమ్ముకోవాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: