ప్రస్తుత రోజుల్లో మహిళలపై జరుగుతున్న దారుణాలు అంతూ చిక్కని విధంగా ఉన్నాయి. మహిళా అని కూడా చూడకుండా ఒక అంగన్ వాడి కార్యకర్తపై గ్రామ వాలంటీర్ దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన సంఘటన అనంతపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం తాలూకా పాత చెరువు లో ఘటన జరిగింది. దీనితో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామ వాలంటీర్ లింగప్ప అనే వ్యక్తి సరుకులు ఇంటికి వెళ్లి ఇవ్వటం లేదంటూ అంగన్ వాడి కార్యకర్త అయిన సువర్ణమ్మ పై దాడికి పాల్పడ్డాడు.

 


దీనితో ఆ గ్రామంలో ఉన్న అంగన్ వాడి కార్యకర్తలు అందరూ కలిసి నిరసన చేపట్టారు. ఇక పాత చెరువు గ్రామంలో సువర్ణమ్మ గడిచిన ఆరు సంవత్సరాలుగా అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తుంది. గ్రామంలో పిల్లలకు, బాలింతలకు అందచేయాల్సిన ఆహార పదార్థాలు అన్నీ కూడా మూడు నెలలుగా ఇంటికి వెళ్లి మరి అందచేస్తుంది. అదే గ్రామానికి చెందిన లింగప్ప వాలంటీర్ గా పని చేస్తూ ఆమెను కొన్ని నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం. 

 


ఇక కేంద్రానికి వెళ్ళిన లింగప్ప సరుకులు ఇంటికి వెళ్లి ఇవ్వటం లేదు ఎందుకు అంటూ పదే పదే అయిన సువర్ణమ్మ పై దాడికి పాల్పడ్డాడు. దీనితో తోటి అంగన్ వాడి కార్యకర్తలు అందరూ కలిసి ఆమెను ఆస్పత్రికి తరలించారు. దింతో నిందితుడైన లింగప్ప పై కేసు నమోదు చేసి కఠిన శిక్ష విధించాలని అంగన్ వాడి కార్యకర్తలు అందరూ డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం లింగప్ప పోలీసుల కసతది ఉన్నాడు. ఈ మధ్య కాలంలో తరచుగా గ్రామ వార్డు వాలంటరీ లపై అనేక ఆరోపణలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. అలాగే ఇటీవల కొందరు వాలంటరీ లపై లైంగిక వేధింపుల ఆరోపణలు రాగా, మరికొందరు అవకతవకలకు పాల్పడుతున్నారు అంటూ కొందరు వాలంటరీ లపై ఆరోపణలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నియమిస్తే వారు మాత్రం దారితప్పి ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమో.

మరింత సమాచారం తెలుసుకోండి: