సాధారణంగా మెంతులను ఆడవాళ్ళు ఇంట్లో తయారు చేసే కర్రీ లో ఉపయోగించడం సర్వసాధారణం. కర్రీ లో మెంతులు ఉపయోగించడం వల్ల మంచి సువాసన వస్తుంది. మెంతులను నీటిలో బాగా నానబెట్టి మిక్సి పట్టిన మిశ్రమాన్ని జుట్టుకు పట్టేస్తే చుండ్రు సమస్యలు అన్నీ కూడా అధిగమించవచ్చు. ఇక కేవలం వంటలకు, జుట్టు లకు మాత్రమే కాకుండా నానబెట్టిన మెంతులు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి. తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు తెలుసుకుందామా మరి...

IHG


ప్రస్తుత రోజుల్లో చాలా వరకు అసిడిటీ సమస్య తో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య నుంచి అధిగమించేందుకు మెంతులు బాగా సహాయపడుతాయి. ఉదయం నిద్ర లేవగానే ఖాళీకడుపుతో నానబెట్టిన ఒక స్పూన్ మెంతులు తినడం వల్ల అసిడిటీ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే నానబెట్టిన మెంతులు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయినీ నియంత్రించడంలో ఇవి బాగా సహాయపడుతుంది. దీనితో డయాబెటిస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. నానబెట్టిన మెంతులు కాకుండా అందుకు ఉపయోగించిన నీరు కూడా బాగా సహాయపడుతుంది. ఇక నానబెట్టిన మెంతుల కంటే మొలకెత్తిన మెంతులలో 40 శాతం ఎక్కువ పోషకాలు లభిస్తాయి. 

IHG


మెంతులు తినడం వల్ల ఇదే సమస్య నుంచి ఎలా అయితే బయట పడతామూ అలాగే నానబెట్టిన మెంతులు తినడం వల్ల జీర్ణక్రియను కూడా మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇక నానబెట్టిన మెంతులు కేవలం డయాబెటిస్ అసిడిటీ సమస్య కే కాకుండా అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారికి కూడా ఒక చక్కటి పరిష్కారం అనే చెప్పాలి. తరువాత నానబెట్టిన మెంతులు తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ నుంచి అధిక కొలెస్ట్రాల్ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: