వైఎస్సార్ జన హ్రుదయ నేత. ఆయన జీవితం ప్రజలకు అంకితం, వైఎస్ బతికి ఉండగా ప్రజా బంధువుగా ఉండేవారు. ఆయన మరణించాక ఏకంగా దేవుడు అయిపోయారు. వైఎస్ జీవితం తెరచిన పుస్తకమే. అందులో రాజకీయ కోణం ప్రజలకు పూర్తిగా తెలుసు. వ్యక్తిగా వైఎస్ ఏంటన్నది రెండవ కోణం. అది తెలియాలంటే ఆయన సాన్నిహిత్యం ఉండాలి.

 

కానీ ఆయనతో 37 ఏళ్ళ పాటు ధర్మ పత్నిగా కలసి అడుగులు వేసిన విజయమ్మ కంటే వైఎస్ గురించి ఎవరికి తెలుస్తుంది. భర్త  ఆలోచనల్లో ఆమె కూడా సగభాగ‌మై, ఆయన ఆశయాల్లో ఆమె కూడా సాగుతూ అచ్చమైన తోడు నీడగా మెలగిన విజయమ్మ కంటే వైఎస్ గురించి ఎవరు బాగా చెప్పగలరు.

 

అందుకే విజయమ్మ తన భర్త గురించి పుస్తకం రాశారు.  దాని పేరు  అది పుస్తకం అనడం కంటే జీవిత సహచారిణిగా ఆమె వేసిన ప్రతీ అడుగు చెప్పే కధగా అంటే బాగుంటుంది. వైఎస్సార్ అంటే జనాలకు తెలిసిన కోణానికి రెండవ వైపే విజయమ్మ పుస్తకంలో ఆయన కనిపించబోతున్నారు.

 

ఒక భర్తగా, తండ్రిగా, మామగా,అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా, బావగా, బావమరిదిగా పేదల వైద్యునిగా స్నేహితునిగా ఎన్నో పాత్రలు వైఎస్సార్ నిజ జీవితంలో పోషించారు. వాటిని గుదిగుచ్చి విజయమ్మ ఈ పుస్తకాన్ని రాశారు. తన భర్త 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడానికి ముందు వరకూ తనతో పంచుకున్న ప్రతీ ఆలోచనా ఆమె అక్షరబద్ధం చేశారు.

 

ముఖ్యంగా వైఎస్సార్ జగన్ తో ఎలా ఉండేవారు, షర్మిలతో ఎలా ఉండేవారు. పిల్లా విషయంలో ఆయన ఆలోచనలు ఏంటి, అసలు వైఎస్ ఆశయాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో ఉంటాయి. ఈ పుస్తకాన్ని వైఎస్సార్ కు సిసలైన వారసుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వైఎస్సార్ జయంతి సందర్ఘంగా ఇడుపుల పాయలోని సమాధి వద్ద ఆవిష్కరిస్తారు.

 

ఇది నిజంగా గొప్ప విషయం. ఒక ముఖ్యమంత్రి గురించి ఆయన సతీమణి రాసిన పుస్తకాన్ని ఆయన కొడుకు అదే ముఖ్యమంత్రి హోదాలో ఆవిష్కరించడం. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకు వారధిగా   విజయమ్మ ఉండడం నిజంగా గొప్ప సన్నివేశమే.

మరింత సమాచారం తెలుసుకోండి: