పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలను తమ రక్షణ కోసం కశ్మీర్ వాడుకుంటోంది. అందుకే పీవోకేలోని ప్రజల్లో కూడా పాక్ పై ద్వేషం అంతకంతకూ పెరుగుతోంది. భారత్ లో జరిగే చిన్నచిన్న సంఘటనలను పెద్దవిగా చూపి పాక్ ఇప్పటివరకూ అక్కడి ప్రజలలో భారత్ పై వ్యతిరేకత పెంచుతోంది. భారత్ లో అన్యాయం జరుగుతుందని పాక్ లోనే న్యాయం జరుగుతుందని ఆ ప్రాంత ప్రజల్లో పాక్ నూరిపోస్తోంది. కశ్మీర్ వ్యవహారంలో కూడా పాక్ ఇదే తరహా నాటకాలు ఆడుతోంది. 
 
అయితే పీవోకే ప్రజలు బలవుతూ ఉండటంతో అక్కడి ప్రజలు ఇమ్రాన్ ఖాన్ కు, అక్కడి సైనికులకు వ్యతిరేకంగా మారే పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే బెలూచ్ ఆర్మీ, సింధ్ ఆర్మీ కానీ పాక్ కు ఎదురు తిరుగుతోంది. అయితే ఇలాంటి సందర్భంలో పాక్ కొత్త ఎత్తులు వేస్తోంది. ఉగ్రవాదులను భారత్ లో చొరబడేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే భారత్ దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులను ఎక్కడికక్కడ మట్టుబెడుతోంది. 
 
దీంతో పాక్ మన దేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ ను అలర్ట్ చేసే ప్రయత్నాలు చేసింది. అయితే వాళ్లను కూడా మనం గుర్తించి అదుపులోకి తీసుకోవడమో కాల్చి చంపడమో చేస్తున్నాం. ఎప్పుడైనా భారత్ సైనికులు ఎదురుకాల్పులు చేస్తే పీవోకే ప్రజల ద్వారా రాళ్లు విసిరేలా చేస్తూ పాక్ సైనికులు తప్పించుకుంటున్నారు. వాళ్లపై కాల్పులు జరిపితే పబ్లిక్ పై భారత్ కాల్పులు జరిపిందంటూ ప్రచారం చేస్తున్నారు. 
 
తాజాగా పాక్ భారత్ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపణలు చేసింది. పదేపదే ఒప్పందం ఉల్లంఘనలకు పాక్ పాల్పడుతూ భారత్ పై ఆరోపణలు చేస్తూ ఉండటం గమనార్హం. ఇలా ఉల్లంఘనలకు పాల్పడుతున్న సమయంలో పీవోకే ప్రజలు మృతి చెందుతుండ్తంతో అక్కడి ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతోంది. భవిష్యత్తులో పీవోకే భారత్ లో కలిసిపోవడానికి ఇంకెంతో సమయం పట్టదనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటంతో పాక్ ప్రభుత్వం టెన్షన్ పడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: