2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో జరిగిన ఎన్నికలలో బీజేపీ పార్టీ  వరుసగా  ఓటమి పాలవడం అందరికీ తెలిసిందే. ఢిల్లీ, చతిస్గడ్, మహారాష్ట్ర ఎన్నికలలో ఓడిపోవడంతో త్వరలో జరగనున్న బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాబోయే ఏడాదిలో జరగబోయే ఎన్నికలలో బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ జండా ఎగరాలని 'టార్గెట్ బెంగాల్' అన్నట్టుగా అమిత్ షా సరికొత్త నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల టైంలో బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి భారీ ఎత్తున స్థానాలు రావడం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో బెంగాల్ రాష్ట్రంలో మమతా సర్కార్ పై ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతను బీజేపీ పార్టీ పక్కాగా ఉపయోగించుకోవాలని సోషల్ మీడియా ద్వారా సరికొత్త ప్రచారానికి అమిత్ షా రెడీ అవుతున్నట్లు సమాచారం. కరోనా వైరస్ టైములో మరియు ఇతర దేశాలకు సంబంధించి యుద్ధాలు జరిగే పరిస్థితి వచ్చిన టైములో కేంద్ర వ్యవహరించిన తీరును సోషల్ మీడియా రూపంలో పశ్చిమబెంగాల్ ప్రజలకు అద్భుతరీతిలో చూపించడానికి అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటున్నారట.

 

ముఖ్యంగా దేశ సరిహద్దు ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తోంది అన్న దాని విషయంలో పశ్చిమబెంగాల్ వాసులకు అర్థమయ్యే రీతిలో చూపించాలని అమిత్ షా రెడీ అవుతున్నారు. అంతేకాకుండా మమత సర్కార్ విషయంలో ప్రజలలో ఉన్న వ్యతిరేకత కలిగిన అంశాలను కూడా టచ్ చేస్తూ ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. దాదాపు రెండు సార్లు మమతా బెనర్జీ గెలవడంతో ఈసారి కచ్చితంగా బీజేపీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దీంతో రాబోయే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని అమిత్ షా సరికొత్త రాజకీయ ఎత్తుగడలతో మమతా బెనర్జీని ఇరుకున పెట్టడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: