పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మొదటి లో వైయస్ జగన్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో పోరాటాలు చేసి, తర్వాత సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా బీజేపీ పార్టీతో చేతులు కలిపిన తరువాత మరోపక్క సినిమాలు ఒప్పుకున్న తర్వాత పూర్తిగా సోషల్ మీడియా బేస్ చేసుకుని పవన్  విమర్శలు చేయడం తప్ప పెద్దగా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో స్పందించిన తీరు గత కొంతకాలంగా ఏమీ లేదు. ఇటువంటి తరుణంలో ఇటీవల అమరావతినే రాజధానిగా ఉంచాలని ఆ ప్రాంతానికి చెందిన రైతులు రాజధానికి భూములు ఇచ్చిన వాళ్లు చేస్తున్న ఆందోళనలు దీక్షలు 200 రోజుకు చేరిన టైం లో దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు నుండి బలమైన స్పందన రావడంతో అమరావతి ఇష్యూ ని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ త్వరలో ప్రత్యక్ష రాజకీయాలు చేయనున్నట్లు టాక్.

 

ఇటీవల 200 వరోజు సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆందోళనలు నిరసనలు చేస్తున్న వారికి సంఘీభావం తెలపడం జరిగింది. తమ పార్టీ తరపున అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తో కలిసి 29 గ్రామాల రైతుల త్యాగాలను వృధా కానీయమని పవన్ పేర్కొనటం జరిగింది. ఇదే టైంలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు విషయంలో ప్రభుత్వ అలక్ష్యం ప్రదర్శించకూడదు అంటూ పేర్కొన్నారు.

 

ఇదిలా ఉండగా త్వరలోనే అమరావతి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ 29 గ్రామాల్లో పాదయాత్ర చేయడానికి రెడీ అయినట్లు ఇక పూర్తిగా ఒక నెల రోజుల పాటు అమరావతి ప్రాంతంలోనే కార్యక్రమాలు ఉండేలా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే అమరావతి సమస్యని బేస్ చేసుకుని జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా ఢీ కొట్టడానికి పవన్ కళ్యాణ్ ప్రజల మధ్య బయటకి వచ్చి సరికొత్త రాజకీయ ఎత్తుగడ వేయనున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినిపిస్తస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: