కర్ణాటక రాష్ట్రంలో కరోనా పరంపర కొనసాగుతోంది. 24 గంటల్లో నమోదైన కరోనా వివరాలను కర్ణాటక ఆరోగ్య మరియు కుటుంబ శాఖ హెల్త్ బులెటిన్ ద్వారా మీడియాకు తెలిపింది. ఇక బులిటెన్ పరంగా చూస్తే... నేడు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1498 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 26,815 కేసులు నమోదయ్యాయి.

 

అలాగే మరోవైపు 576 మంది కరోనా నుండి విముక్తి పొంది సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 11,098 కు చేరుకుంది. 

IHG

ప్రస్తుతం రాష్ట్రం మొత్తంగా 15,297 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇందులో 279 మందికి వారి ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరోవైపు నేడు ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మరణించగా, దేశంలో ఇప్పటివరకు మరణాల సంఖ్య 416 కు చేరుకుంది. మరోవైపు రాష్ట్ర రాజధాని బెంగళూరులో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. గత వారం నుండి రోజు 1000 కేసులకు పైగా మహానగరంలో నమోదవుతున్నాయి. దీనితో బెంగళూరు వాసులు బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కరోనా ను నివారించేందుకు బెంగళూరు మహా నగరంలో అనేక ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: