గత రెండు నెలలుగా చైనా భారత్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. చైనా భారత్ సైనికులు సరిహద్దు ప్రాంతాల నుంచి వెనక్కు వెళుతున్నారు. చైనా సైనికులు వాస్తవాధీన రేఖ నుంచి 2 కిలోమీటర్లు, భారత్ సైనికులు వాస్తవాధీన రేఖ నుంచి ఒకటిన్నర కిలోమీటర్లు వెనక్కు వెళుతున్నారు. 
 
కానీ చైనా సైనికులను భారత్ నమ్మట్లేదు. అదే సమయంలో అమెరికా కూడా నమ్మట్లేదు. చైనా గతంలో వ్యవహరించిన తీరు వల్లే ఆ దేశాన్ని అనుమానంగానే ఈ దేశాలు చూస్తున్నాయి. వెనక్కు వెళ్లామని చెబుతూనే చైనా గతంలో వ్యవహరించిన తీరు వల్ల ఆ దేశాన్ని ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. చైనా ఫసిఫిక్ మహా సముద్రం దగ్గర తాజాగా చైనా బలగాలను మోహరిస్తోంది. ఫసిఫిక్ మహాసముద్రంపై తమకు ఉన్న హోదాను వదులుకోమని అమెరికా తేల్చి చెబుతోంది. 
 
చైనా విషయంలో అమెరికా సైన్యం ధృడంగా వ్యవహరిస్తుందని ఆ దేశ అధికార ప్రతినిధులు చెబుతున్నారు. చైనా లేదా ఇతర దేశమైనా దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తే క్షమించబోమని చైనా తేల్చి చెప్పింది. అటువంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమని వ్యాఖ్యలు చేసింది. భారత్ చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ నౌకలను ఏర్పాటు చేయడం వెనుక ప్రబల పొరాట సామర్థ్యం ఉందని ప్రపంచానికి చాటి చెప్పడమే అని అమెరికా చెబుతోంది. 
 
భారత్ చైనా మధ్య వివాదం సద్దుమణిగినట్టు అనిపించినా ఆ ప్రాంతంపై పట్టు వదులుకోవడానికి సిద్ధంగా లేమని అమెరికా చెబుతోంది. తాజాగా అమెరికా ఆ ప్రాంతానికి బలగాల మోహరింపును మరింతగా పెంచిందని తెలుస్తోంది. భారీస్థాయిలో ఆయుధాలను కూడా అక్కడకు సరఫరా చేస్తోంది. చైనా వ్యవహార శైలి అమెరికాకు ఏ మాత్రం నచ్చటం లేదు. అందువల్ల అమెరికా చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: