జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 30 లక్షల పేదలకు జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా సీఎం జగన్ ఉచిత ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలనుకున్నారు. కానీ హఠాత్తుగా ఈ కార్యక్రమం ఆగష్టు 15కు వాయిదా వేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమం వాయిదా పడటానికి టీడీపీనే కారణమని సీఎం జగన్ చెప్పారు.

 

ఇళ్ల పట్టాలపై టీడీపీ కోర్టుకెళ్లిందని, అందుకే వాయిదా పడిందని జగన్ డైరక్ట్‌గా చెప్పేశారు. కానీ డి-పట్టాల రూపంలో ఇవ్వాలనుకుంటే ఈరోజే ఇవ్వొచ్చని, కానీ రిజిస్ట్రేషన్‌ చేసి ఆస్తి రూపంలో ఇవ్వాలని భావించామని జగన్ చెబుతున్నారు. అయితే 30 లక్షల మంది పేదలకు ఎంతగానో ఉపయోగపడే ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రతిపక్ష టీడీపీ ముందు నుంచి ఆరోపణలు చేస్తూ వస్తుంది.

 

ఇక ఇప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా డైరక్ట్‌గా కోర్టు మెట్లు ఎక్కేసింది. దీంతో 30 లక్షల మంది పేదలకు టీడీపీ అన్యాయం చేస్తోందని వైసీపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. అయితే వైసీపీ చేసే ప్రచారం బాగానే ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనుకున్నారు. కానీ కోర్టుకెళ్ళి టీడీపీ దాన్ని అడ్డుకోవాలని చూస్తోంది. ఇక్కడవరకు అంతా బాగానే ఉంది. వైసీపీ చేసే ప్రచారం బట్టి చూస్తే పేదలకు టీడీపీ అన్యాయం చేస్తోందని చెప్పుకోవచ్చు.

 

కాకపోతే ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. ఇళ్ల పట్టాల్లో చాలారకాలుగా అవినీతి జరిగిందని కేవలం టీడీపీనే ఆరోపణలు చేయలేదు. కొంతమంది ప్రజలు కూడా బహిరంగంగానే మాట్లాడారు. ఇక ఇళ్ల పట్టాల్లో అక్రమాలు జరిగినట్లు ప్రజలందరికీ తెలుసని, ఆ విషయం వైసీపీ వాళ్ళకు కూడా తెలుసని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాబట్టి ఇళ్ల పట్టాలు కార్యక్రమం అడ్డుకోవాలని చూస్తోందని ప్రచారం చేస్తూ టీడీపీని ఇరుకున పెట్టాలని వైసీపీనే ఇరుక్కుపోతుందని తమ్ముళ్ళు గట్టి కౌంటర్‌గా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: