సబ్బం హరి....ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సబ్బం...2009లో అనకాపల్లి ఎంపీగా పనిచేశారు. అయితే వైఎస్సార్ మరణం తర్వాత, జగన్ సెపరేట్ పార్టీ పెట్టాక...సబ్బం ఏపీ రాజకీయాల్లో హైలైట్ అయ్యారు. జగన్‌కు కుడిభుజంగా నడుచుకున్నారు. కొంతకాలంగా వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. జగన్ జైలుకు వెళ్ళే సమయంలో కూడా సబ్బం వైసీపీకి అండగా ఉన్నారు. కానీ ఏమైందో ఏమో గానీ 2014 ఎన్నికల ముందు సబ్బం...జగన్‌ని వదిలేశారు.

 

ఆ తర్వాత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీలోకి వెళ్ళి, 2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా నామినేషన్ వేసి, ఊహించని విధంగా వైఎస్ విజయమ్మని ఓడించాలనే ఉద్దేశంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక బయటకొచ్చి చంద్రబాబుకు భజన చేశారు. అలా భజన చేయడంతోనే చంద్రబాబు, 2019 ఎన్నికల్లో సబ్బంకి భీమిలి టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో సబ్బం ఓటమి పాలయ్యారు. ఇటు టీడీపీ ఘోరంగా ఓడిపోవడం, అటు జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చేయడంతో ,సబ్బం జగన్‌ని విమర్శించడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు.

 

టీడీపీ అనుకూల మీడియా డిబేట్లలోకి వచ్చి బాబుని లేపుతూ, జగన్‌ ప్రభుత్వంపై నెగిటివ్ తీసుకురావాలని తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంతలా సబ్బం హడావిడి చేయడానికి కారణం లేకపోలేదు. ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేయడానికి చూస్తున్నారని టీడీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అయితే విశాఖలో బాలయ్య చిన్నల్లుడు భరత్ ఉన్నారు. మొన్న జగన్ గాలిలో సైతం ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు.

 

ఓడిపోయిన దగ్గర నుంచి పార్టీలో బాగానే పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ సడన్‌గా సబ్బం ఎంట్రీ ఇచ్చి భరత్‌కు చెక్ పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే సబ్బం అనకాపల్లి పార్లమెంట్ సీటులో పోటీ చేస్తే బాలయ్య చిన్నల్లుడుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా ఇప్పుడు అనకాపల్లిలో టీడీపీకి నాయకుడు లేరు. కాబట్టి సబ్బం అనకాపల్లి సీటు ఇచ్చే ఛాన్స్‌లు బాగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: