చైనా దేశం ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది. ప్రపంచ దేశాలు ప్రస్తుతం డ్రాగన్ ను ఒంటరి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. జపాన్ కు సునోస్ దీవులను చైనా ఆక్రమించడానికి ప్రయత్నిస్తోంది. జపాన్ ఆ దీవులు తమవే అని చెబుతున్నా చైనా మాత్రం తీరును మార్చుకోవడం లేదు. దీంతో జపాన్ చైనా సైనికులపై మిస్సైల్స్ కూడా ప్రయోగించడానికి సిద్ధమైంది. దీంతో చైనా జపాన్ జలాల్లోకి చైనా వెళ్లింది. 
 
మరలా ఆ ప్రాంతం నుంచి వెనక్కు వచ్చింది. అలా ముందుకు వెళుతూ వెనక్కు వస్తూ చైనా జపాన్ ను బెదిరించే ప్రయత్నాలు చేస్తోంది. చైనా చేస్తున్న ఇలాంటి పనులే ఆ దేశానికి శత్రు దేశాలను తయారు చేస్తున్నాయి. వియత్నాం, తైవాన్, జపాన్ దగ్గర యుద్ధవిన్యాసాలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది. అయితే ఆ దేశ విశ్లేషకులు మాత్రం జపాన్ తో వివాదం మంచిది కాదని సూచిస్తున్నాయి. 
 
జపాన్ తో యుద్ధం పెట్టుకుంటే అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా తిరగబడే అవకాశం ఉందని భావిస్తున్నాయి. పాక్ తప్ప చైనాకు సపోర్ట్ చేసే దేశం లేదు. అయితే ఇదే సమయంలో చైనా జపాన్ వస్తువులను బహిష్కరించాలని ప్రయత్నిస్తోంది. చైనా ఆ దేశంలో ప్రజలకు డ్రాగన్ ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయిలో ఉందని... ప్రపంచ దేశాలు డ్రాగన్ పై ఆధారపడక తప్పదని నూరిపోస్తున్నాయి. 
 
ఆ దేశంలోని పాఠ్యపుస్తకాల్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. జపాన్ ఇప్పటికే చైనా వస్తువులను బహిష్కరించడంతో పాటు డ్రాగన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో చైనా జపాన్ వస్తువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. అన్ని దేశాలతో శత్రుత్వం పెంచుకుంటున్న చైనా ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు పడకపోయినా భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉంది.                                    

మరింత సమాచారం తెలుసుకోండి: