ప్రస్తుతం భారతదేశంలో కరోనా  వైరస్ కేసులు సంఖ్య అమాంతం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ 20 వేలకుపైగా కరోనా  కేసులు నమోదవుతున్నాయి అంతకంతకు దేశంలో కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇక ఈ మహమ్మారి వైరస్ కి వ్యాక్సిన్ కూడా లేదు అని ఎంతగానో భయాందోళనకు గురి అవుతున్న సమయంలో ఇటీవలే భారత్ బయోటెక్ అందరికీ ఒక శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. తాము కరోనా వైరస్  కు వాక్సిన్  కనుగొన్నామని మూడు నెలల్లో దానిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. 

 


 దేశ వ్యాప్తంగా 13 ఆసుపత్రులను  ఎంపిక చేసుకుని రేపు మనుషులపై ట్రైల్స్ ప్రారంభించనున్నారు. తెలంగాణలో నిజాం ఇన్స్టిట్యూట్ లో కొంతమంది పేషెంట్ లపై, ఏపీలో విశాఖపట్నం లోని కింగ్ జార్జ్ హాస్పిటల్ లోని కొంతమంది పై పరీక్షలు చేయనున్నారు. అయితే ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందుగా ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్  తీసుకోవాలనుకునే వ్యక్తి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నాడా లేడా అనేది చెక్ చేసిన తర్వాత ఆ  వ్యక్తిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. 

 

 ఇక సదరు వ్యక్తులకు రోజు ఈ వ్యాక్సిన్ ఇస్తూ వారిలో మార్పు ఎలా వస్తుంది.. ఈ వ్యాక్సిన్ ను ఎదుర్కొనే టప్పుడు ఎలా ఉంటుంది అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అయితే 18 నెలల సమయం పట్టే ఈ వ్యాక్సిన్ను అత్యవసరంగా కేవలం మూడు నెలల సమయంలోనే  అందుబాటులోకి తెచ్చేందుకు శరవేగంగా చర్యలు జరుగుతున్నాయి. అయితే ఇది ఇప్పటికే జంతువుల మీద సక్సెస్ అయింది కాబట్టి ఐసీఎంఆర్ నుంచి కూడా అనుమతులు లభించాయి. అయితే ఈ వైరస్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందని దేశ ప్రజానీకం ఊపిరి బిగపట్టుకుని ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది.వాక్సిన్ సక్సెస్ అయితే  ప్రపంచానికి కూడా విశ్వగురువు కానుంది భారత్.

మరింత సమాచారం తెలుసుకోండి: