ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా  వైరస్ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో ప్రజలందరూ కరోనా  వైరస్ బారిన పడతామెమో  అని భయపడినప్పటికీ ప్రస్తుతం కరోనా  వైరస్ తో సహవాసం సహజీవనం తప్పదు అని అందరూ అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు . ఈ వైరస్కు వ్యాక్సిన్ లేనందున ప్రస్తుతం ప్రత్యామ్నాయ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల  ప్రస్తుతం విద్యార్థుల భవిష్యత్తు అంధకారం లోకి వెళుతున్న విషయం తెలిసిందే. విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు స్కూళ్లు కళాశాలలు ఎప్పుడు తెరుచుకుంటామో తెలియదు.. అంతా అయోమయం లో ఉన్నారు ప్రస్తుతం విద్యార్థులు. 

 

 అయితే ఇప్పటికే ప్రైవేట్ కళాశాలలు విద్యాసంస్థల్లో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాయి  ఇక ప్రభుత్వ పాఠశాల పరిస్థితి  ఏమిటి.. తాజాగా ప్రభుత్వ పాఠశాలల విషయంలో జగన్ సర్కారు ఒక ప్రయోగం చేయతలపెట్టింది . జూలై 13 నుంచి వారానికి ప్రైమరీ స్కూల్ అయితే ఒకరోజు... అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ని రెండు రోజులపాటు.. హైస్కూల్ కూడా వారానికి రెండు రోజులు.. ఇలా గ్యాప్ ఇస్తూ విద్యా సంస్థలను ప్రారంభించడానికి  జగన్ సర్కార్ వినూత్న ప్రయోగానికి ముందడుగు వేసింది. 

 


 అయితే ఇది జగన్ సర్కార్కు తెగింపుతో కూడిన ఎటువంటి పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం పెద్దవాళ్ళకే  కరోనా  వైరస్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంతేకాకుండా ప్రస్తుతం ఆసుపత్రిలో నిండుగా కరోనా పేషెంట్ లతో నిండి పోయాయి. పూర్తిగా గందరగోళ వాతావరణం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇలా విద్యాసంస్థలను ప్రారంభించాలి అనడం విద్యార్థుల జీవితాలను ప్రమాదంలో పెట్టడమే అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం బాగానే ఉన్నప్పటికీ చిన్న తేడా వచ్చినా విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటున్నారు. ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి సదుపాయాలు కల్పించి తరువాత పలు జాగ్రత్తలు తీసుకుని ఇలాంటివి చేస్తే బాగుంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: