గత కొన్ని రోజుల నుంచి భారత్-చైనా సరిహద్దు లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ వైపు  ఇరుదేశాల సైనిక అధికారులు చర్చలు జరుపుతూనే మరోవైపు భారీగా సైన్యాన్ని సరిహద్దుల్లో మోహరించడం అంతేకాకుండా ఆయుధాలను కూడా సరిహద్దుల్లోకి రప్పించడం లాంటివి జరగడంతో పూర్తిగా యుద్ధ వాతావరణం నెలకొంది, చైనా భారత్ మధ్య తలెత్తిన వివాదం కాస్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే వాస్తవంగా అయితే భారత్ సైన్యం  సరిహద్దుల్లోనే ఉంది కానీ.. చైనా మాత్రం పాంగ్వాన్ సరస్సు .. గాల్వన్ లోయ  దగ్గర భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ముందుకు వచ్చింది. 

 

 ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో చైనా వెనక్కి వెళ్లాల్సిందే అంటూ భారత్ చర్చలు  జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న అజిత్ దోవల్ రంగంలోకి దిగి చర్చలు జరపడంతో చైనా గాల్వన్ లోయ  వద్ద రెండు కిలోమీటర్ల పాటు వెనక్కి తిరిగి వెళ్ళింది. అయితే ప్రస్తుతం కాలం లో నుంచి చైనా సైన్యం 2 కిలోమీటర్లు  వెనక్కి వెళ్లే కార్యక్రమం చేపట్టింది. కానీ పాంగ్వాన్ సరస్సు దగ్గర మాత్రం చైనా సైన్యం అలాగే ఉంది. పాంగ్వాన్  సరస్సు దగ్గర ఫింగర్ పాయింట్ అని సరిహద్దు ఉంటుంది అనే విషయం తెలిసిందే. 

 

 ఇందులో ఒకటి నుంచి నాలుగు వరకు భారత భూభాగంలో ఉంటే.. 8 నుంచి అవతల పక్క మొత్తం చైనా సరిహద్దుల్లో ఉంటుంది ఇక ఈ నాలుగు నుంచి ఎనిమిది మధ్యలో ఉన్న ఫింగర్ పాయింట్ విభాగంలో ఇరుదేశాల సైన్యాలు పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉంటాయి. అయితే చైనా సైన్యం ఏకంగా ఈ నాలుగు ఫింగర్ పాయింట్ దాటి  భారత సరిహద్దు వరకు వచ్చింది. కానీ ఇటీవల చైనా ఒక్క ఫింగర్ పాయింట్ వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు నాలుగవ ఫింగర్ పాయింట్ లో ఉన్న చైనా ప్రస్తుతం 5 ఫింగర్ పాయింట్ కి వెనుతిరిగిందని తాజాగా భారత సైనిక అధికారులు తెలిపారు. ఇలా క్రమక్రమంగా భారత్ దాటికీ చైనా వెనకడుగు వేస్తుందని అంటున్నారు  విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: