ప్రభుత్వపరంగా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, ప్రజల కోసం ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, కొన్ని కొన్ని విషయాల్లో వైసిపి చెడ్డపేరు మూటకట్టుకోవడం, ప్రతిపక్షాలు విమర్శలు చేసే అవకాశం ఇస్తుండడం వంటి విషయాలపై ఏపీ సీఎం జగన్  సీరియస్ గానే దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు. తాజాగా స్పందన కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించిన జగన్ ఈ విషయం పై అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది వర్షాకాలం కావడంతో, ఇసుక విషయంలో ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు.

 

IHG

రాష్ట్రంలో ఎక్కడా, ఇసుక కొరత అనే మాట వినిపించుకూడదని, అధికారులు ఏం చేస్తారో ? ఎలా చేస్తారో తనకు తెలియదని, రాష్ట్రంలో ఇసుక కొరత అనేది లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించాలని, ఈ బాధ్యత కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లదేనని జగన్ సీరియస్ గానే వ్యాఖ్యానించారు. ఇప్పటికే వర్షాలు ఎక్కువగా కురుస్తుండడంతో, ఇసుక రీచ్ లలోకి నీళ్లు వచ్చే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని, పదిరోజుల్లో రాష్ట్రానికి అవసరమైన ఇసుకను జాగ్రత్త చేసుకోవాలని, ఈ మేరకు జిల్లా యంత్రాంగం, కలెక్టర్లు , జాయింట్ కలెక్టర్ లు ఈ విషయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి, పెద్ద ఎత్తున నిల్వలు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని, సరఫరా విషయంలో కూడా పారదర్శకంగా పారదర్శకంగా ఉండాలని సూచించారు.

 

IHG

లేకపోతే అధికారులకు మాత్రమే కాకుండా, ప్రభుత్వానికి  కూడా చెడ్డపేరు వస్తుందని, గతంలో ఇసుక కొరత కారణంగా ప్రభుత్వానికి ఇదే విధంగా చెడ్డ పేరు వచ్చిందని, ఇప్పుడు ఆ సమస్య రాకుండా, చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ ల మీద ఉందని సీఎం జగన్ చెప్పారు. మొత్తంగా ఇసుక వ్యవహారంలో గతంలో అభాసుపాలవ్వడంతో ఇప్పుడు ఆ పరిస్థితి తలెత్తకుండా జగన్ ముందుగానే జాగ్రత్తపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: