చైనాతో అదే ఇబ్బంది. మాట్లాడింది చేయదు, చేసింది చెప్పదు, అంతా నయ వంచన, అంతా కుటిలత్వం, నమ్మిన వాడు నిండా మునగాల్సిందే. ఈ విషయంలో ఎవరైనా ఒకటే. డ్రాగన్ అంటే డేంజరస్ కంట్రీ అన్న పేరు తెచ్చుకుంది. అందుకే చైనా పెద్ద దేశమైనా శత్రువులనే తప్ప నమ్మదగ్గ మిత్రులను సంపాదించుకోలేకపోతోంది.

 

ఇపుడు చైనా భారత సరిహద్దుల నుంచి చాలా సైలెంట్ గా తప్పుకుంటోంది. ఇది నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడిన తరువాతనే చైనా బలగాలు వెనుతిరిగాయని అంటున్నారు. అదే నిజం అని నమ్మినా ఎక్కడో ఏదో సందేహం. ఇంకెక్కడో మరో రకమైన డౌట్.

 

నిజంగా చైనా వెళ్ళిపోతోందా. గాల్వాన్ లోయ నుంచి ఖాళీ చేస్తోందా. ఇది భారత్ సైనికులకే కాదు, సాధారణ పౌరులకు కూడా కలుగుతున్న డౌట్లు. నిజంగా ఇలా ఎందుకు ప్రశ్నలు అనుమానాలు వస్తున్నాయంటే ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి చైనా చరిత్రను చూస్తే ఇదే విషయం అర్ధమవుతుంది. అది 1962.  అపుడు కూడా గాల్వాన్ లోయ వద్దనే చైనా మోహరించింది.

 

భారత్ ని అక్కడే సవాల్ చేసింది. అపుడు కూడా కొంత ఘర్షణ ఉద్రిక్తల నడుమ చివరికి  చెప్పా పెట్టకుండా 1962  జూలై 17న అంటే ఇదే నెలలో చైనా బలగాలు వెనక్కి వెళ్ళిపోయాయి. సరే అంతా బాగుందని భారత్ నిబ్బరంగా ఉంటే ఉరమని పిడుగులా చైనా సేనలు విరుచుకుపడ్డాయి.

 

అది 1962  అక్టోబర్ నెల 22వ తేదీ శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో అంటే తమకు అనుకూలం చూసుకుని ముహూర్తం కూడా సరిగ్గా పెట్టుకుని మరీ చైనా సైన్యాలు భారత్ మీద విరుచుకుపడ్డాయి. నవంబర్ 21 వరకూ అంటే నెల రోజుల పాటు యుధ్ధం చేశాయి. భారత్ ఆ యుధ్ధం ఊహించలేదు. అందుకే సన్నద్ధం కాలేదు. దాంతో ఓడిపోయింది.

 

ఇపుడు కూడా చైనా బలగాలు వెనక్కి వెళ్తూంటే నాటి ఘటనలు గుర్తుకువస్తున్నాయి. మళ్లీ దొంగ దెబ్బ తీసేందుకేనా చైనా ఇల్లా కామ్ గా వెళ్లిపోయింది అని డౌట్ పడుతున్నారు. అయితే ఈసారి భారత్ అప్రమత్తంగానే ఉంది. చైనా దెబ్బకు గట్టి జవాబు ఇవ్వడానికి కూడా సిధ్ధంగా ఉంది. గస్తీ ఇంకా పెంచింది. అందువల్ల చైనా ఆటలు ఈసారి సాగవని అంతా అంటున్నారు. ఇది 1962 కాదు, 2020 ఇపుడు ప్రధానిగా మోడీ ఉన్నారు. సో చైనా ఈసారి కాదు, ఏసారి అయినా తోక ముడవక తప్పదు అంతే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: