తెలంగాణలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. మంగళవారం కూడా భారీగా కొత్త కేసులు బయటపడ్డాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన మీడియా బులెటిన్ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల్లో 6,220 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 1879 మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. అలాగే ఒక్క రోజే ఏడుగురు క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 27,613కి చేరింది. అలాగే క‌రోనా మృతుల సంఖ్య 313కి పెరిగింది.

 

ఒక్క రోజులో భారీగా 1506 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 16,287కి చేరిందిమంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో 1,422, రంగారెడ్డిలో 176, మేడ్చల్‌లో 94, కరీంనగర్‌లో 32, నల్గొండలో 31 నిజామాబాద్‌లో 19 కేసులు నమోదయ్యాయి.

 

మెదక్‌, ములుగు జిల్లాల్లో 12, వరంగల్ అర్బన్ జిల్లాలో 13, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 9, కామారెడ్డిలో 7, జయశంకర్ భూపాలపల్లిలో 6, గద్వాలలో 4, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 3, జగిత్యాల, మహబూబాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 2 కేసులు, వికారాబాద్, ఆదిలాబాద్, జనగామ, వనపర్తి, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కోకేసు చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

 

తెలంగాణలో ఇప్పటి వరకు 1,28,438 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం 4,341 ఫలితాలు నెగెటివ్‌గా తేలాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: