కరోనా వైరస్ రాకముందు తెలంగాణ బీజేపీ పార్టీ సారధిగా ఎంటర్ అయినా బండి సంజయ్ పార్టీలో మిగతా నాయకులతో కలవటానికి చాలా టైం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. కరోనా కారణంగా పార్టీ తరపున అడపాదడపా కార్యక్రమాలు చేసిన కింద క్యాడర్ తో కలిసి పార్టీ అధ్యక్షుడుగా బండి సంజయ్ ఇప్పటి వరకు సరైన కార్యక్రమం ఒకటి కూడా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టలేక పోయారు. పార్టీకి ఎవరు ప్లస్ ఎవరు మైనస్ అనే దాని విషయంలో కూడా బండి సంజయ్ కి ఇప్పటికి సరైన క్లారిటీ లేదని తెలంగాణ బిజెపి పార్టీలో టాక్. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ పార్టీ ని ఎలాగైనా పటిష్ట పరచడానికి మొదటి నుండి ఢిల్లీలో ఉన్న బీజేపీ పార్టీ పెద్దలు గట్టిగానే తెలంగాణ రాష్ట్రంపై కాన్సెంట్రేషన్ చేయడం జరిగింది. దీంతో గత సార్వత్రిక ఎన్నికల టైంలో కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని గెలిచిన బండి సంజయ్ ని పార్టీ అధ్యక్షుడిగా మార్చి 15వ తారీఖున ప్రకటించడం జరిగింది.

 

ఆ తర్వాత కరోనా రావడంతో పార్టీ తరపున ఏ కార్యక్రమాలు బండి సంజయ్ చేయలేకపోయారు. కరోనా పుణ్యమా అని ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో అన్ని తలకిందులు అయిపోవడంతో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న తరుణంలో ఇదే టైమ్ లో గవర్నర్ ని తెలంగాణ ప్రజలు సంప్రదించడం తో ఇటీవల ఓ కార్యక్రమంలో బండి సంజయ్ షాకింగ్ కామెంట్ చేశాడు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని, అందువల్లే వారు గవర్నర్ ను సంప్రదిస్తున్నారని ఆయన చెప్పారు. గవర్నర్ ప్రభుత్వ అదికారులను పిలిస్తే, వారు వెళ్లడానికి భయపడుతున్నారని ఆయన అన్నారు.

 

కరోనా కట్టడికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయడం లేదని సంజయ్ విమర్శించారు. గతంలో ఇంటర్ విద్యార్దులు చనిపోయినా ప్రభుత్వం స్పందించలేదని, ఆయా సందర్భాలలో ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. ఈ విధంగా క్యాడర్ ని కరోనా వల్ల కలవకపోయినా కానీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ బండి సంజయ్ నిత్యం వార్తల్లో నిలుస్తూ దాదాపూ తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించేలా బండి సంజయ్ వ్యవహరిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: