అత్యధిక సీట్లు విషయంలో పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా, రాజ్యసభలో ఆరో అతిపెద్ద పార్టీగా వైసీపీ పార్టీ ఆవిష్కరించబడింది. చాలా వరకు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో వైసీపీ అవసరం తప్పనిసరి పరిస్థితి రాజ్యసభలో ఉంది. అంతేకాకుండా అధికారంలో ఉన్న మోడీ చాలా సార్లు వైయస్ జగన్ కి కేంద్ర క్యాబినెట్ మంత్రుల విషయంలో చాలా సార్లు ఆఫర్లు ఇవ్వడం జరిగింది. అయినా గానీ వైయస్ జగన్ వాటిని ఏమీ పట్టించుకోలేదు. మీడియా కూడా వైయస్ జగన్ ప్రధానితో సమావేశమైన ప్రతిసారి కేంద్ర కేబినెట్ లోకి ఆ ఇద్దరు వైసీపీ పార్టీ నాయకులు వెళ్తున్నారని వార్తలు ప్రసారం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవేమీ వాస్తవం లోకి వచ్చేసరికి నిజం కాలేదు.

 

ఇదిలా ఉండగా త్వరలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మిత్ర పక్షం జేడీయూకు కేంద్ర క్యాబినెట్ లో చోటు కల్పించే దిశగా ప్రధాని మోడీ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో సంఖ్యాబలం పరంగా అటు పార్లమెంటు స్థానాల పరంగా చూసుకుంటే మరొకసారి జగన్ కి కేంద్ర మంత్రివర్గంలో వెళ్లే ఛాన్స్ ఉన్న మళ్లీ వెనుకడుగు వేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.

 

కారణం చూస్తే వైసిపి పార్టీకి గట్టి పునాదులు దళితులు మరియు మైనార్టీ ఓటు బ్యాంకు కావడంతోనే వైయస్ జగన్ మోడీ క్యాబినెట్ లోకి వెళ్లే ఛాన్స్ ఉన్న కలవలేక పోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా రాకుండా కేంద్ర ప్రభుత్వంతో చెట్టాపట్టాలేసుకుని వ్యవహరిస్తే పార్టీకి కొంత డ్యామేజ్ జరగటం గ్యారెంటీ అని జగన్ అనుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్. అందువల్ల కేంద్ర క్యాబినెట్ లోకి జగన్ వెళ్ళటానికి ఇష్టపడటం లేదని వార్తలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: