ఒకపక్క పార్టీ పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుండటంతో, టీడీపీ అధినేత చంద్రబాబులో  రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులే టార్గెట్ గా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుండడం, కీలక నాయకులు అందరిని, తమ వైపు తిప్పుకుని తమ బలం తగ్గించేందుకు ప్రయత్నించడం, పార్టీ తరఫున యాక్టివ్ గా ఉన్న నాయకులపై  కేసులు పేరు చెప్పి భయపెట్టే విధంగా, వ్యవహరించడం ఇలా ఎన్నో అంశాలు చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. కరోనా కారణంగా ప్రస్తుతానికి చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం అయిపోయినా, అక్కడి నుంచే నిరంతరం పార్టీ కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే, బాబు కంచుకోట చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంపై ఆయన ఎక్కువగా ఈ మధ్యకాలంలో దృష్టిసారిస్తున్నారు.

 

IHG

 

గతం కంటే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పరిస్థితులు మారిపోవడం. వైసీపీ వైపు ఎక్కువగా జనాలు మొగ్గుచూపుతుండటంతో ఆ విషయాలు ఇప్పడు బాబును కలవరపెడుతున్నాయి. అందుకే తరచూ ఆ నియోజకవర్గంపై దృష్టి పెడుతూ, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్వయంగా కుప్పం నియోజకవర్గంలో పర్యటించి పార్టీలోనూ, స్థానిక ప్రజల్లోనూ, జోష్ నింపే విధంగా ప్రయత్నిద్దాం అనుకున్నా, కరోనా కారణంగా గడపదాటనివ్వడం లేదు. అలాగే ఆ నియోజకవర్గంలో బలమైన నాయకుడుగా ఉన్న వారందరినీ వైసిపి తమ పార్టీలో చేర్చుకుంది. అది కాకుండా నియోజకవర్గానికి సంబంధించి కొన్ని అభివృద్ధి పనులను కూడా నిలిపివేయడంతో, ప్రస్తుతం చంద్రబాబు దృష్టి మొత్తం నియోజకవర్గంపైన పెట్టాడు. చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గంతో అనుబంధం ఇప్పటిది కాదు.

 

1989 నుంచి 2019 వరకు మొత్తం ఏడు సార్లు ఆయన వరుసగా ఓటమి అనేది లేకుండా వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు మెజారిటీ తగ్గడం ఆందోళనకు గురి చేస్తోంది.కుప్పంలో వచ్చే ఎన్నికల నాటికి బాబు హవా తగ్గించే విధంగా వైసీపీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ టిడిపికి సానుకూల పరిస్థితులు లేకుండా, కీలకమైన నాయకులందరినీ వైసీపీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది గమనించే చంద్రబాబు తరచూ కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ, అధికారులకు సూచనలు ఇస్తూ తన పట్టు జారిపోకుండా చూసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: